News April 2, 2024

జపాన్ సముద్రంలోకి నార్త్ కొరియా క్షిపణి!

image

నార్త్ కొరియా మరోమారు దుస్సాహసానికి ఒడిగట్టిందని దక్షిణ కొరియా ఆరోపించింది. జపాన్ సముద్రంలోకి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని తెలిపింది. జపాన్ కోస్టు గార్డు ఆ విషయాన్ని ధ్రువీకరించింది. ఇది ఈ ఏడాది ఉత్తర కొరియా చేపట్టిన మూడో క్షిపణి ప్రయోగం కావడం గమనార్హం. దక్షిణ కొరియా తమకు ప్రధాన శత్రువని, తమ భూభాగంలో 0.1శాతాన్ని ఆక్రమించినా యుద్ధాన్ని ప్రకటిస్తామని ఉత్తర కొరియా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Similar News

News November 8, 2024

నిస్సాన్‌లో 9,000 మందికి లేఆఫ్స్

image

జపాన్‌లో మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ‘నిస్సాన్’ భారీగా లేఆఫ్స్‌కు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా 9,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇందులో యూరప్‌లోనే 4,700 జాబ్స్ ఉన్నట్లు వెల్లడించింది. అలాగే కార్ల ఉత్పత్తిని 20% తగ్గిస్తామని తెలిపింది. నిస్సాన్ వార్షికాదాయ అంచనాను 70 శాతం($975 మిలియన్) కుదించింది. తాము తీసుకునే చర్యలతో మళ్లీ పుంజుకుంటామని CEO మకోటో ఉచిద ధీమా వ్యక్తం చేశారు.

News November 8, 2024

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోస్టుకార్డుల ఉద్యమం

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోస్టుకార్డుల ఉద్యమానికి ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ సిద్ధమైంది. ఈ నెల 10న విశాఖ ఆర్కే బీచ్ రోడ్ కాళీ మాత ఆలయం వద్ద ఈ ఉద్యమం ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీకి దాదాపు 10 లక్షల పోస్టుకార్డులు పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఈ కార్డుల ద్వారా ప్రధానిని కోరుతామని కన్వీనర్ రమణమూర్తి చెప్పారు.

News November 8, 2024

DEC 18 నుంచి డిపార్ట్‌మెంటల్ టెస్టులు

image

AP: ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి నిర్వహించే డిపార్ట్‌మెంటల్ టెస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు ఈ నెల 13 నుంచి వచ్చే నెల 3 వరకు అప్లై చేసుకోవాలని సూచించింది. డిసెంబర్ 18 నుంచి 23 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం <>https://psc.ap.gov.in/<<>> వెబ్‌సైట్‌లో చూడాలంది.