News October 15, 2025

ఈశాన్య రుతుపవనాలు.. దేశంలోకి రేపే ఎంట్రీ!

image

ఈశాన్య రుతుపవనాలు గురువారం(oct-16) దేశంలోకి ప్రవేశించనున్నట్లు IMD పేర్కొంది. తర్వాత 1,2 రోజులకు APలో విస్తరించే అవకాశం ఉంది. ఈశాన్య రుతుపవనాల వల్ల ఈ నెల నుంచి డిసెంబర్ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు బంగాళాఖాతంలో ఈ నెల 22, 23 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

Similar News

News February 21, 2026

ప్రెగ్నెన్సీలో TT ఇంజెక్షన్ తీసుకోవచ్చా?

image

తల్లి, బిడ్డకు ధనుర్వాతం (టెటానస్ ఇన్ఫెక్షన్) రాకుండా నిరోధించడానికి ప్రెగ్నెన్సీలో TT ఇంజెక్షన్ కచ్చితంగా తీసుకోవాలంటున్నారు నిపుణులు. దీన్ని రెండు డోసులు తీసుకోవాలి. 2/3 నెలలో మొదటి డోస్, ఆ తర్వాత నాలుగు వారాల గ్యాప్‌తో రెండో డోస్ తీసుకోవాలి. అలాగే ప్రెగ్నెన్సీకి ముందు మూడేళ్లలో TT ఇంజెక్షన్ తీసుకుంటే బూస్టర్ డోస్ సరిపోతుందని చెబుతున్నారు.

News February 21, 2026

మనిషికి ‘బర్డ్‌ఫ్లూ’ సోకిందన్న ప్రచారం అవాస్తవం: వైద్యారోగ్య శాఖ

image

AP: చిత్తూరు జిల్లాలో ఓ యువకుడికి బర్డ్‌ఫ్లూ సోకిందన్న ప్రచారాన్ని వైద్యారోగ్య శాఖ ఖండించింది. రాష్ట్రంలో ఎక్కడా మనుషులకు బర్డ్‌ఫ్లూ సోకలేదని స్పష్టం చేసింది. అనుమానిత లక్షణాలున్న 54 మందికి టెస్టులు చేయగా నెగటివ్ వచ్చిందని పేర్కొంది. ఇటీవల చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కోళ్లకు బ‌ర్డ్‌ఫ్లూ సోకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

News February 21, 2026

కందులను నిల్వ చేసేటప్పుడు జాగ్రత్తలు

image

కంది గింజలను గోనె సంచులలో లేదా ట్రిపుల్ లేయర్ బ్యాగులలో గాని నిల్వ చేయాలి. బస్తాలు నిల్వ చేసే గది గోడలపైన, నేలపై లీటరు నీటికి మలాథియాన్ 50% ఇ.సి 20ML కలిపి పిచికారీ చేయాలి. కంది గింజలు నింపిన బస్తాలను చెక్క బల్లలపై వరుసలలో పేర్చి తేమ తగలకుండా జాగ్రత్త వహించాలి. గృహ అవసరాల కోసం నిల్వ చేస్తే బాగా ఎండనిచ్చి ఆ తర్వాత ఏదైనా వంటనూనె 50mlను కిలో గింజలకు పట్టించి నిల్వచేసి పురుగు ఉద్ధృతిని తగ్గించవచ్చు.