News October 10, 2025
ఈ నెలలో ఈశాన్య రుతుపవనాల ఎంట్రీ!

AP: ఈ నెల 16 లేదా 17న దేశం నుంచి నైరుతి రుతుపవనాలు ఎగ్జిట్ అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు సౌత్ ఇండియాలోకి ఎంటర్ అవుతాయని పేర్కొంది. వీటి ప్రభావంతో వర్షాలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. నేడు అల్లూరితో పాటు రాయలసీమలో పిడుగులతో భారీ వానలు పడతాయని APSDMA వెల్లడించింది.
Similar News
News October 10, 2025
నోబెల్ పీస్ ప్రైజ్: ట్రంప్‌కు మద్దతిచ్చిన రష్యా

కాసేపట్లో నోబెల్ పీస్ ప్రైజ్ ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ అవార్డుకు పోటీ పడుతున్న ట్రంప్‌కు మద్దతిస్తున్నట్లు రష్యా ప్రతినిధి యూరీ ప్రకటించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపేందుకు ట్రంప్ చేస్తున్న కృషిని ఇటీవల రష్యా స్వాగతించిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలు మద్దతిస్తున్నప్పటికీ ట్రంప్‌కు అవార్డు రావడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News October 10, 2025
జక్కన్న సినిమాల్లో మీ ఫేవరెట్ ఏది?

దర్శకధీరుడు రాజమౌళి బర్త్ డే సందర్భంగా ఆయన తీసిన సినిమాల గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఆయన 12 సినిమాలు తీస్తే ప్రతీది బ్లాక్‌బస్టరే. టాలీవుడ్‌లోని పలువురు యంగ్ హీరోలకు ఆయన కెరీర్ బెస్ట్ హిట్స్ ఇచ్చారు. స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, సై , ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కంక్లూజన్, RRR సినిమాల్లో మీ ఫేవరెట్ ఏంటి? ఎందుకు? COMMENT
News October 10, 2025
13న ఢిల్లీకి చంద్రబాబు.. GOOGLEతో ఒప్పందం!

AP: CM CBN ఈనెల 13న ఢిల్లీ వెళ్లనున్నారు. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ (IND) VSPలో ₹87,520 కోట్లతో ఏర్పాటుచేయనున్న డేటా సెంటర్‌పై ఒప్పందం చేసుకోనున్నారని సమాచారం. అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ ఇదే కానుంది. దీనికోసం 480 ఎకరాల్లో 3 క్యాంపస్‌లు ఏర్పాటుచేస్తారు. వీటి ద్వారా లక్షన్నర ఉద్యోగాలు వస్తాయని అంచనా. 14న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, CBN సమక్షంలో దీనిపై కీలక ప్రకటన రానుంది.