News November 4, 2024
నార్త్ లేబర్ క్రైసిస్: సౌత్ స్టేట్స్కు ఇబ్బంది

చెన్నై మెట్రో రెండో దశ పనులకు 40% లేబర్ షార్టేజ్ సౌత్ స్టేట్స్ను ఇబ్బంది పెడుతోంది. లోక్‌సభ పోలింగ్ కోసం ఝార్ఖండ్, బెంగాల్, బిహార్, ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లినవాళ్లు మళ్లీ తిరిగి రావడం లేదు. మెట్రో, రోడ్లు, ఇన్ఫ్రా ప్రాజెక్టులతో UP సహా నార్త్‌లోనే వారికి చేతినిండా పని దొరుకుతోంది. ఫ్యామిలీకి దగ్గరగా ఉంటున్నారు. పైగా వారిపై వెగటు వ్యాఖ్యలూ ప్రభావం చూపాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. మీ కామెంట్.
Similar News
News February 8, 2026
గద్వాల: రేపటితో ముగియనున్న ప్రచారం.. మద్యం దుకాణాలు బంద్

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5:00 గంటలతో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సమయం ముగిశాక ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు సాయంత్రం నుంచే ‘డ్రై డే’ అమల్లోకి రానుందని, ఎన్నికలు ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని ఆదేశించారు.
News February 8, 2026
ఐర్లాండ్ టార్గెట్ ఎంతంటే?

T20WC: ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక తడబడి నిలబడింది. తొలుత బ్యాటర్లు పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచినా మెండిస్ ద్వయం అదరగొట్టింది. 20 ఓవర్లలో 163/6 రన్స్ చేసింది. కుశాల్ మెండిస్(56), కమిందు మెండిస్(44), నిస్సంక(24) మాత్రమే రాణించారు. IRE బౌలర్లు జార్జ్, మెక్‌కార్తీ చెరో 2, మార్క్ అడైర్, డెలానీలు చెరో వికెట్ తీశారు. ఐర్లాండ్ 20 ఓవర్లలో 164 రన్స్ చేయాలి.
News February 8, 2026
రూ.100 కోట్లతో BJPని ఓడించాలనుకుంటున్నారు: బండి

TG: MIMతో BRS, కాంగ్రెస్ లాలూచీ పడ్డాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ‘కరీంనగర్ రావడానికి రేవంత్ భయపడి ఒవైసీని పంపారు. ఇక్కడ ఎన్నికలు ఇండియా-పాక్ మ్యాచ్‌లా ఉంటాయి. MIM, కాంగ్రెస్ రహస్య మీటింగ్ పెట్టుకున్నాయి. రూ.100కోట్లు ఖర్చు పెట్టి BJPని ఓడించాలనుకుంటున్నారు. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదే. ఇక్కడ MIM గెలిస్తే ప్రజలను ఎవరూ కాపాడలేరు’ అని కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు.


