News October 23, 2025

10వేలు కాదు.. 4వేల అడుగులు నడిచినా సేఫే: అధ్యయనం

image

ప్రతిరోజూ పది వేల అడుగులు నడవాలని వైద్యులు సూచించడంతో ఈ లక్ష్యాన్ని చేరుకోలేక చాలామంది ఆందోళన చెందుతుంటారు. అయితే వృద్ధ మహిళలు వారానికి ఒకట్రెండు రోజులు కేవలం 4వేల స్టెప్స్ నడిచినా చాలని, ఇది అకాల మరణం & గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. వారంలో ఎక్కువ రోజులు 4,000 స్టెప్స్ లేదా అంతకంటే ఎక్కువ నడిస్తే, మెరుగైన ఆరోగ్య ఫలితాలు ఉంటాయని స్టడీ స్పష్టం చేసింది.

Similar News

News October 23, 2025

‘మీ తాత కూడా ఇండియా నుంచే వచ్చాడు..!’

image

సామూహిక వలసలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ US రిపబ్లికన్ నేత నిక్కీ హెలీ కొడుకు నలిన్ హేలీ చేసిన ట్వీట్ చర్చకు దారితీసింది. వలసలతో US పౌరులకు ఉద్యోగాలు లభించడంలేదన్నారు. దీంతో అతడికి బ్రిటీష్-అమెరికన్ జర్నలిస్ట్ మెహదీ హసన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘మీ తాత కూడా ఇండియా నుంచే వచ్చారు’ అని నలిన్‌కు గుర్తుచేశారు. నిక్కీ హెలీ తండ్రి అజిత్ సింగ్ రంధవా 1969లో అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

News October 23, 2025

ఇండియా టెక్ డెస్టినేషన్‌గా ఏపీ: CM CBN

image

డేటా సెంటర్లు, AI మెషీన్ లెర్నింగ్, ఫిన్‌టెక్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్సు వంటి రంగాల్లో పెట్టుబడులకు AP ఎంతో అనుకూలమని CM CBN తెలిపారు. ఇండియా టెక్ డెస్టినేషన్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. UAE టెక్ కంపెనీలతో కలిసి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. అబుదబీలో నెట్వర్క్ లంచ్‌లో పాల్గొన్న ఆయన ఆ దేశ ఛాంబర్ ఛైర్మన్, ADNOC గ్లోబల్ ట్రేడింగ్ ప్రతినిధులతో భేటీ అయ్యారు.

News October 23, 2025

తేలని ‘స్థానిక’ అంశం!

image

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తదుపరి సమావేశంలో చర్చిద్దామని CM రేవంత్ చెప్పినట్లు సమాచారం. BCలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది. అయితే NOV 3న HC తీర్పు ఉండటంతో 7న మరోసారి భేటీ కావాలని సీఎం నిర్ణయించారు. ఆ రోజు రిజర్వేషన్లు, ఎలక్షన్స్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.