News April 4, 2025

300 కాదు.. సగం కూడా కష్టమే!

image

IPL-2025: 300 లోడింగ్. SRH ఆడే ప్రతి మ్యాచుకు ముందు అభిమానుల ఆశ ఇది. 300 సంగతి పక్కన పెడితే అందులో సగం కూడా చేయలేకపోతోంది సన్‌రైజర్స్. ఉప్పల్ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో అక్కడ భారీగా పరుగులు చేస్తున్నారు. మిగతా స్టేడియాల్లో పిచ్, పరిస్థితులను అంచనా వేయకుండా బ్యాట్ ఊపడమే పనిగా పెట్టుకున్నారు. ఫలితంగా ఓపెనర్లు తొలి ఓవర్లలోనే ఔట్ అవుతుండటంతో బ్యాటింగ్ కుప్పకూలుతోంది.

Similar News

News November 24, 2025

ఎన్నికలపై విచారణ వాయిదా

image

TG: పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో ఇవాళ జరగాల్సిన విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది. కాగా కోర్టు ఆదేశాల మేరకు 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానానికి ప్రభుత్వం తెలియజేయనుంది.

News November 24, 2025

హనుమాన్ చాలీసా భావం – 19

image

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।
జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥
సూర్యుడిని పండుగా భావించి ఆకాశంలో ఎగిరిన బలవంతుడు హనుమ. అలాంటిది శ్రీరాముని ఉంగరంతో సముద్రాన్ని దాటడం ఆశ్చర్యాన్ని కలిగించదు. హనుమంతుని అద్భుత శక్తులు తెలిసిన తర్వాత సముద్ర లంఘనం ఆయనకు ఎంతో సులువు అని కవి ఉద్దేశం. దైవకార్య సాధనలో ఎంత కష్టమైన పనైనా సునాయసంగా పూర్తవుతుందనే సందేశం ఈ దోహా ఇస్తోంది. <<-se>>#HANUMANCHALISA<<>>

News November 24, 2025

INDSETIలో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు

image

ఇండియన్ బ్యాంక్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ <>(INDSETI<<>>) ఆఫీస్ అసిస్టెంట్ కోసం దరఖాస్తులు కోరుతోంది. BSW/BA/B.COM అర్హతగల వారు DEC 6వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 22-40ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.20,000-రూ.27,500 చెల్లిస్తారు. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.indianbank.bank.in/