News December 20, 2024
అరపైసా అవినీతి జరగలేదు: KTR

TG: మంత్రిగా ఫార్ములా ఈ-రేస్ విషయంలో విధాన నిర్ణయం తీసుకున్నానని KTR అన్నారు. ‘డబ్బులు పంపిన విధానం తప్పు అని పొన్నం అంటున్నారు. ఈ కేసులో ACBకి కేసు పెట్టే అర్హత లేదు. అరపైసా అవినీతి జరగలేదు. ప్రభుత్వం తప్పులను హరీశ్ బయటపెట్టినందుకు సిట్ వేశారు. ORR టెండర్లు, కోకాపేట భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. నన్ను ఏ కేసులో జైలుకు పంపాలో ప్రభుత్వానికి అర్థం కావడం లేదు’ అని అన్నారు.
Similar News
News November 23, 2025
తల్లి పాలల్లో యురేనియం ఆనవాళ్లు.. కానీ!

ఈ ప్రపంచంలో తల్లి పాలను మించిన పోషకాహారం లేదు. కానీ మారిన వాతావరణ పరిస్థితులతో వాటిలోనూ రసాయనాలు చేరుతున్నాయి. తాజాగా బిహార్ తల్లుల పాలల్లో యురేనియం(5ppb-పార్ట్స్ పర్ బిలియన్) ఆనవాళ్లు గుర్తించినట్లు NDMA సైంటిస్ట్ దినేశ్ వెల్లడించారు. అయితే WHO అనుమతించిన స్థాయికంటే తక్కువగానే ఉన్నాయని, దీనివల్ల ప్రస్తుతానికి ప్రమాదం లేదని చెప్పారు. నీటిలో మాత్రం 6 రెట్లు ఎక్కువగా యురేనియం ఆనవాళ్లు ఉన్నాయన్నారు.
News November 23, 2025
పొల్యూషన్ నుంచి కాపాడే ఫుడ్స్ ఇవే

ప్రస్తుతం వాయుకాలుష్యం పెద్ద సమస్యగా మారింది. లైంగిక పరిపక్వత, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక సమస్యలు వస్తున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే బెర్రీస్, బ్రోకలీ, పసుపు, ఆకుకూరలు, చేపలు ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు కలిగిన విభిన్న ఆహారాలను చేర్చుకోవడం వల్ల కాలుష్యం నుంచి మిమ్మల్ని రక్షించుకోగలుగుతారని చెబుతున్నారు.
News November 23, 2025
స్మృతి మంధాన పెళ్లి వేదిక వద్దకు అంబులెన్స్.. పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్!

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ కంపోజర్ పలాశ్ ముచ్చల్ పెళ్లి వేదిక వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. వేడుకలకు హాజరైన అతిథికి గుండెపోటు రావడంతో అంబులెన్స్‌లో సాంగ్లీలోని సర్వ్‌హిత్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి వివరాలు తెలియనప్పటికీ పెళ్లి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై ఈవెంట్ ఆర్గనైజర్లు, కుటుంబ సభ్యులు ఇంకా స్పందించలేదు.


