News August 22, 2025

ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదు: మంత్రి శ్రీనివాస్

image

AP: ప్రభుత్వం పెన్షన్లను తొలగిస్తోందన్న YCP ఆరోపణలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు. ’15 నెలల్లో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదు. 65 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నాం. గతంలో కొందరు నకిలీ సర్టిఫికెట్లతో దివ్యాంగ పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అందుకే 80వేల మందికి నోటీసులు ఇచ్చాం. తగిన సర్టిఫికెట్ చూపిస్తే పెన్షన్ వస్తుంది. 9నెలల నుంచి పెన్షన్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతోంది’ అని తెలిపారు.

Similar News

News March 23, 2026

6 నెలల కనిష్ఠానికి LNG ఎగుమతులు

image

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్లోబల్ LNG ఎగుమతులు ఆరు నెలల కనిష్ఠానికి పడిపోయినట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ఈ నెల ప్రారంభం నుంచి దాదాపు 20% తగ్గి 1.1 మిలియన్ టన్నులకు(10 రోజుల సగటు ప్రకారం) తగ్గినట్లు తెలిపింది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకోవడంతో ఖతర్, UAE నుంచి ఎక్స్‌పోర్ట్స్ ఆగిపోయాయని పేర్కొంది. దాడులకు గురైన ప్రపంచంలోనే అతిపెద్దదైన రస్ లఫాన్‌లో మరమ్మతులకు కొన్నేళ్లు పడుతుందని అంచనా.

News March 23, 2026

అకాల వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట నష్టం

image

AP: అకాల వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 11,337 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 15 జిల్లాల్లోని 9,950 హెక్టార్లలో వ్యవసాయ.. 9 జిల్లాల్లోని 1,387 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. వరి 2,650 హెక్టార్లు, మొక్కజొన్న 6,450 హెక్టార్లు, 485 హెక్టార్లలో మినుము పంట దెబ్బతింది. NTR, కృష్ణా, NLR జిల్లాల్లో వ్యవసాయ పంటలు.. NTR, ప్రకాశం, NLR, TPT జిల్లాల్లో అరటి, మామిడి, నిమ్మ, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి.