News January 16, 2025
ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు: KTR

TG: ఫార్ములా-ఈ కేసులో ED విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో KTR ట్వీట్ చేశారు. ‘HYDలో ఈ ఈవెంట్ నిర్వహించినప్పుడు ఇతరులు మన నగరాన్ని ప్రశంసిస్తుంటే గర్వంగా అనిపించింది. HYD బ్రాండ్ను పెంచడమే నాకు ముఖ్యం. FEOకి ₹46cr బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేశాం. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు. రాజకీయ కుట్రతో కేసు పెట్టారు. త్వరలోనే నిజం బయటకు వస్తుంది. మా పోరాటాన్ని కొనసాగిస్తాం’ అని పేర్కొన్నారు.
Similar News
News January 19, 2026
‘రాజాసాబ్’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన ‘రాజాసాబ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో విడుదలైన 10 రోజుల్లో ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.139.25 కోట్లు(నెట్) వసూలు చేసినట్లు Sacnilk తెలిపింది. నిన్న ఈ సినిమా రూ.2.50 కోట్లు రాబట్టినట్లు అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో రూ.180 కోట్ల నెట్ కలెక్షన్స్ దాటినట్లు సినీ వర్గాలు తెలిపాయి.
News January 19, 2026
ECILలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

హైదరాబాద్లోని <
News January 19, 2026
వరిలో అగ్గి తెగులు – నివారణకు సూచనలు

వరి దుబ్బు చేసే దశలో అగ్గి తెగులు కనిపిస్తుంది. దీని వల్ల వరి పైర్లలో ఆకులపై నూలు కండె ఆకారం మచ్చలు కనిపిస్తాయి. ఆకుల మీద, వెన్నుల మీద గోధుమ రంగు లేదా ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. ఉద్ధృతి ఎక్కువగా ఉంటే మొక్క వెన్నువిరిగి వేలాడుతుంది. ఆకులు ఎండిపోయి తగలబడినట్లు కనిపిస్తాయి. దీని నివారణకు లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 75% 0.6gm లేదా అజాక్సీస్ట్రోబిన్+టెబుకోనజోల్ 2 ml కలిపి పిచికారీ చేసుకోవాలి.


