News August 16, 2024
కేసులకు భయపడను: జోగి రమేశ్

AP: చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ మంగళగిరి PSలో విచారణకు హాజరయ్యారు. ఆ రోజు తాను కేవలం నిరసన తెలిపేందుకే చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లానని చెప్పారు. ఈ ఘటన సమయంలో వినియోగించిన కారు, ఫోన్‌ను ఆయన తీసుకొచ్చారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘కేసులకు భయపడను. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తాను. చంద్రబాబు, లోకేశ్ హామీలకు బదులు రెడ్‌బుక్ అమలు చేస్తున్నారు’ అని ఆగ్రహించారు.
Similar News
News December 9, 2025
కోడి పిల్లలను వదిలాక షెడ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కోళ్ల షెడ్లో ప్రతి 50 కోడి పిల్లలకు ఒక మేత తొట్టి, నీటి తొట్టి అమర్చాలి. తొలి వారంలో 50 పిల్లలకు 24 అంగుళాల మేత తొట్టి సరిపోతుంది. ప్రతి బ్రూడరు కింద 3-4 నీటి తొట్లను అమర్చాలి. వాటిని రోజూ శుభ్రపరచి నీటితో నింపాలి. కోడి పిల్లలను ఉంచిన షెడ్లో రాత్రంతా లైట్లను ఆన్‌లో ఉంచాలి. కోడి పిల్లలకు తొలి 7-10 రోజుల మధ్య ముక్కును కత్తిరిస్తే అవి ఒకదానినొకటి పొడుచుకోవడం, తొట్లలో మేతను కిందకు తోయడం తగ్గుతుంది.
News December 9, 2025
గ్లోబల్ సమ్మిట్: ప్రతినిధులకు రిటర్న్ గిఫ్టులు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరైన ప్రతినిధులకు రాష్ట్ర వైభవాన్ని చాటే ప్రత్యేక సావనీర్లు(గిఫ్ట్స్) అందించారు. వీటిలో సంప్రదాయ పోచంపల్లి ఇక్కత్ చీర, ముత్యాల నగరానికి ప్రతీకగా ముత్యాల చెవిపోగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే తెలంగాణ కళాకారులు చేతితో చేసిన లక్క గాజులు, సుగంధ సంప్రదాయాన్ని తెలిపే హైదరాబాద్ అత్తర్, రాష్ట్ర వారసత్వ సంస్కృతిని తెలిపే చేర్యాల పెయింటింగ్ చెక్క బొమ్మలు ఉంచారు.
News December 9, 2025
స్వాతంత్ర్య సమరాన్ని BJP వ్యతిరేకించింది: ఖర్గే

స్వాతంత్ర్య సమరం, దేశభక్తి గీతాలను వ్యతిరేకించిన చరిత్ర బీజేపీదని AICC చీఫ్ ఖర్గే విమర్శించారు. ‘గాంధీ పిలుపునిచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమంలో వందేమాతరం అంటూ లక్షల మంది స్వాతంత్ర్య సమరయోధులు జైలుకు వెళ్లారు. అప్పుడు BJP సిద్ధాంతకర్తలు బ్రిటీషర్ల కోసం పనిచేస్తున్నారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పిలుపునిచ్చిన వందేమాతరం ఉద్యమంలో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరించింది’ అని ఖర్గే రాజ్యసభలో వ్యాఖ్యానించారు.


