News July 3, 2024

కాంగ్రెస్ బెదిరింపులకు భయపడం: హరీశ్ రావు

image

TG: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ బెదిరింపులకు తాము భయపడమని ఆయన అన్నారు. ‘పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసును ఖండిస్తున్నాం. ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే ఆయన చేసిన నేరమా? అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటాం. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News October 25, 2025

పాములను పూజించడం వెనుక పర్యావరణ హితం

image

సాధారణంగా శీతాకాలంలో, పంటలు ఇంటికొచ్చే సమయంలో పాములు పుట్టల నుంచి, వాటి రంధ్రాల నుంచి బయటకు వస్తాయి. ఈ సమయంలో వాటిని హింసించకుండా ఉండేందుకు ఈ పండుగ జరుపుతారు. నాగ దేవతలు పొలాల్లోని ధాన్యాన్ని నాశనం చేసే ఎలుకలను వేటాడి, పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. ప్రకృతిలోని ఏ జీవినీ సంహరించకుండా, ప్రతి ప్రాణికీ జీవించే హక్కును గౌరవించాలని మన ఆచారం బోధిస్తుంది. పాములను పూజించడం ద్వారా నాగజాతిని కాపాడినట్లే.

News October 25, 2025

ఏపీ TET-2025 షెడ్యూల్ ఇదే..

image

ఏపీలో <>TET-<<>>2025 దరఖాస్తు ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 23వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ మాక్ టెస్ట్ నవంబర్ 25న రాయవచ్చు. డిసెంబర్ 3న హాల్ టికెట్లు రిలీజ్ చేస్తారు. డిసెంబర్ 10న రెండు సెషన్లలో(ఉ.9.30-మ.12గంటల వరకు, మ.2.30-సా.5గంటల వరకు) ఎగ్జామ్ నిర్వహిస్తారు. జనవరి 2న కీని విడుదల చేస్తారు. ఫైనల్ కీని జనవరి 13న, 19న ఫలితాలు విడుదల అవుతాయి.

News October 25, 2025

నితీశ్ కుమార్‌ దూరం.. కారణం ఏంటంటే?

image

భారత యంగ్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి గాయమైంది. అడిలైడ్‌లో రెండో వన్డే ఆడుతున్న సమయంలో ఎడమ తొడ కండరాలకు గాయం కాగా నేటి మ్యాచ్‌ సమయానికి ఫిట్‌నెస్ సాధించలేదు. దీంతో ఇవాళ్టి వన్డేకు దూరమయ్యారు. నితీశ్ గాయంపై తమ మెడికల్ టీమ్ నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు BCCI వెల్లడించింది. అటు తొలి వన్డేలో చివర్లో సిక్సులతో నితీశ్ విరుచుకుపడ్డారు. బౌలింగ్‌లో చాలినంత అవకాశం రాలేదు.