News September 24, 2024
జగన్ను నిందించట్లేదు.. కానీ: పవన్

AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో తాను మాజీ సీఎం జగన్ను నిందించట్లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే జగన్ ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డులోనే ఈ తప్పు జరిగిందని పేర్కొన్నారు. ‘ఒకవేళ జగన్ ఎలాంటి తప్పు చేయకపోతే విచారణకు సహకరించాలి. లడ్డూ వ్యవహారంలో దోషులను శిక్షించమని చెప్పాలి’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.
Similar News
News November 25, 2025
నిజామాబాద్ జిల్లాలో అతివలే కీలకం

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారులు విడుదల చేసిన ఓటరు తుది జాబితా ప్రకారం నిజామాబాద్ జిల్లాలో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. జిల్లాలో మొత్తం 8,51,417 మంది ఓటర్లు ఉండగా మహిళలు 4,54,621 మంది ఉన్నారు. ARMR డివిజన్లో 1,95,092 మంది, BDN డివిజన్లో 1,21,591 మంది, NZB డివిజన్లో 1,46,938 మంది మహిళలు ఉన్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా పురుషులు 3,96,778 మంది ఉన్నారు. ఇతరులు 18 మంది ఉన్నారు.
News November 25, 2025
గ్యాస్ లీకైనపుడు ఏం చేయాలంటే?

ఇంట్లో గ్యాస్ సిలిండర్, స్టవ్ లీకేజీ, నిర్వహణ లోపాలతో ప్రమాదాలు జరిగి తీవ్ర విషాదాలను మిగులుస్తున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే.. గ్యాస్ లీకై దాన్ని అదుపు చేయలేకపోతే కిటికీలు, తలుపులు తెరవాలి. మంటలు చెలరేగితే మందపాటి దుప్పటి కప్పి ఆర్పేయాలి. రెగ్యులేటర్ను ఆపేయాలి. సిలిండర్ దగ్గర మంటలు చెలరేగితే తడిగా ఉండే గోనెసంచి/ వస్త్రాన్ని వేయాలి. అగ్నిమాపక శాఖ టోల్ఫ్రీ నంబరు 101కు సమాచారం ఇవ్వాలి.
News November 25, 2025
అంత్యక్రియల తర్వాత స్నానం ఎందుకు చేస్తారు?

అంత్యక్రియలు పూర్తయ్యాక అక్కడికి వెళ్లిన వాళ్లందరూ స్నానం చేస్తారు. లేకపోతే ఆత్మలు దేహంలోకి ప్రవేశిస్తాయని నమ్ముతుంటారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదు. దహన సంస్కారాల సమయంలో ఆ దేహం నుంచి వచ్చే బ్యాక్టీరియా, అంటువ్యాధులు మనక్కూడా సోకే ప్రమాదం ఉంది. ఈ అంటురోగాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి, కచ్చితంగా స్నానం చేయాలి. అప్పట్లో నదులే స్నానానికి ప్రధాన వనరులు కాబట్టి అక్కడే స్నానమాచరించేవారు.


