News March 21, 2024
ప్రతి వెధవను గౌరవించక్కర్లేదు: నాగబాబు

AP: జనసేన నేత నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘వయసు ఎక్కువ, పెద్దవాడు అని ప్రతి వెధవను గౌరవించక్కర్లేదు. ఎందుకంటే వెధవలు కూడా పెద్దవాళ్లు అవుతారు’ అంటూ కన్ఫ్యూషియస్ కోట్‌ను పోస్ట్ చేశారు. దీనికి ‘ఏం మాట్లాడినా మా గురించేనేమోనని ఆపాదించుకుంటున్నారు. ఇది ఎన్నికల సమయం కాబట్టి నా ఉద్దేశాలను చెపుతున్నానే కానీ.. ఎవరినీ ఉద్దేశించి చెప్పింది కాదు’ అని వివరణ ఇచ్చారు. తాను చెప్పింది జీవిత సత్యమని తెలిపారు.
Similar News
News January 15, 2026
తగ్గిన బంగారం ధర.. మరోసారి పెరిగిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.820 తగ్గి రూ.1,43,180కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.750 తగ్గి రూ.1,31,250గా ఉంది. మరోవైపు వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. నిన్న కేజీపై రూ.15,000 పెరగగా, ఈరోజు రూ.3,000 పెరిగింది. మొత్తంగా రెండు రోజుల్లో 18,000 ఎగబాకి రూ.3,10,000 చేరింది.
News January 15, 2026
బాలింతలు యాంటీబయాటిక్స్ తీసుకోవచ్చా?

పాలిచ్చే తల్లులు యాంటీబయాటిక్స్ తీసుకోవచ్చా లేదా అనేది వారి ఆరోగ్యస్థితిపై ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగే పిల్లల వయసు, ఆరోగ్యం, తల్లికి ఉన్న అనారోగ్యాన్ని బట్టి డాక్టర్లు యాంటీబయాటిక్స్ రాస్తారు. పాలద్వారా యాంటీబయాటిక్స్ తక్కువ మొత్తంలోనే ట్రాన్స్‌ఫర్ అవుతాయి. అయినా ఇలాంటి మందులేవైనా వాడేముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోనే వాటిని వాడాలని సూచిస్తున్నారు.
News January 15, 2026
విమానాలు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు

నిరసనల కారణంగా ఇరాన్ <<18861323>>గగనతలాన్ని<<>> మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో ఎయిరిండియా, ఇండిగో సహా భారతీయ విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేశాయి. కొన్ని అంతర్జాతీయ విమానాలను దారిమళ్లిస్తున్నట్లు, మరికొన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ మార్పులు, అప్డేట్ల కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌లను పరిశీలించాలని కోరాయి. మరోవైపు ఇప్పటికే కేంద్రం ఇరాన్‌లోని భారతీయులను అప్రమత్తం చేసింది.


