News August 10, 2024
రుణమాఫీ కాలేదా? అయితే..
TG: రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ డబ్బులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయగా, పలువురు తమకు రాలేదంటున్నారు. డబ్బులు అందని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక సూచనలు చేశారు. ‘చిన్న చిన్న పొరపాట్లతో కొందరికి మాఫీ కాలేదు. అలాంటి వారంతా ఈ నెల 15 తర్వాత వ్యవసాయ అధికారులను కలిసి సమస్యలను వివరించాలి. ఆ తప్పులను సరిచేసి అర్హులకు రుణమాఫీ అందేలా అధికారులు చర్యలు తీసుకుంటారు’ అని తుమ్మల చెప్పారు.
Similar News
News February 6, 2025
హర్షిత్ రానా అరుదైన రికార్డు
భారత యువ పేసర్ హర్షిత్ రాణా భారీగా పరుగులిస్తున్నా వికెట్లు తీస్తూ ఆకట్టుకుంటున్నారు. మూడు ఫార్మాట్లలో (టెస్ట్, ODI, టీ20) డెబ్యూ మ్యాచుల్లో మూడేసి వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్గా రికార్డు నెలకొల్పారు. టెస్టులో AUSపై 3/48, టీ20లో ENGపై 3/33, ODIలో ENGపై 3/53 వికెట్లతో రాణించారు. అలాగే వన్డేల్లో డెబ్యూ మ్యాచులో ఒకే ఓవర్లో అత్యధిక రన్స్ (26) సమర్పించుకున్న భారత బౌలర్గా నిలిచారు.
News February 6, 2025
డిన్నర్ కోసమే భేటీ అయ్యాం: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
TG: తాము డిన్నర్ కోసమే రహస్యంగా భేటీ అయ్యామని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్కు స్పష్టం చేశారు. దీంతో అంతర్గత సమస్యలు ఏమైనా ఉంటే పార్టీ పెద్దలకు తెలపాలని సీఎం వారికి సూచించారు. మరోవైపు ఎమ్మెల్సీ <<15361441>>తీన్మార్ మల్లన్నపై చర్యలు<<>> తీసుకోవాలని నేతలు సీఎంను కోరారు. కాగా ఈ సమావేశానికి మల్లన్న గైర్హాజరు కావడం గమనార్హం.
News February 6, 2025
ప్రైవేటు కంపెనీలకూ ఆధార్ అథెంటికేషన్ సేవలు
కేంద్ర ప్రభుత్వం ఆధార్ అథెంటికేషన్ సేవలను ప్రైవేటు సంస్థలకూ విస్తరించింది. ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం డిజిటల్ KYCని ఉపయోగించుకొనేందుకు అనుమతించింది. 2025, JAN 31 నుంచే ప్రభుత్వేతర సంస్థలు ఈ సేవలకు దరఖాస్తు చేసుకొనే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇది BFSI సెక్టార్లో ఓ గేమ్ఛేంజర్ అని UIDAI DyDG మనీశ్ భరద్వాజ్ తెలిపారు. 2010 నుంచి తాము 14000 కోట్ల అథెంటికేషన్ లావాదేవీలను ప్రాసెస్ చేసినట్టు తెలిపారు.