News August 10, 2025

బంగారం కాదు.. ఇవే విలువైనవి: వారెన్ బఫెట్

image

కింగ్ ఆఫ్ స్టాక్స్‌గా పేరుగాంచిన వారెన్ బఫెట్ దృష్టిలో బంగారానికి విలువలేదు. దాదాపు రూ.12 లక్షల కోట్ల(140 బి.డాలర్స్) ఆస్తులున్న ఆయన ఒక్క రూపాయీ బంగారంపై పెట్టలేదు. 2011లో ఓ గోల్డ్ మైనింగ్ కంపెనీలో పెట్టుబడి పెట్టినా 6 నెలల్లోనే వెనక్కి తీసుకున్నారు. బంగారమా, భూమా? అంటే.. ఆయన భూమే కొనమంటారు. గోల్డ్ కంటే భూమి, వ్యాపారంపై ఇన్వెస్ట్ చేయడం మంచిదంటారు. అవే దీర్ఘకాలిక ప్రయోజనాలు అందిస్తాయని చెప్తారు.

Similar News

News August 10, 2025

అల్పపీడనం.. 3 రోజులు అతిభారీ వర్షాలు

image

ఈనెల 13న పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో 13,14,15 తేదీల్లో తెలంగాణలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే HYD సహా జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. అటు ఏపీలో అల్పపీడనం ప్రభావంతో రేపటి నుంచి 14 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇవాళ కోస్తా, రాయలసీమల్లోని పలుచోట్ల పిడుగులతో కూడిన వానలు పడతాయని తెలిపింది.

News August 10, 2025

ఇందిరమ్మ ఇళ్లు.. బిల్లు స్టేటస్ ఇలా తెలుసుకోండి!

image

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఆన్‌లైన్‌లో పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం వెబ్‌సైట్‌ను అప్డేట్ చేసింది. బిల్లు ఎక్కడి వరకు వచ్చింది? ఏ కారణంతో ఆగిపోయింది? వంటి సమాచారాన్ని <>ఇందులోనే<<>> తెలుసుకోవచ్చు. లబ్ధిదారు ఫోన్/ఆధార్/రేషన్/అప్లికేషన్ నంబర్లలో దేనితోనైనా లాగిన్ కావొచ్చు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3 లక్షల ఇళ్లు మంజూరు కాగా 4 విడతల్లో రూ.5లక్షల చొప్పున ఇస్తోంది.

News August 10, 2025

కూలీ క్రేజ్.. సెలవు ప్రకటించిన సాఫ్ట్‌వేర్ కంపెనీ

image

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ మూవీ ఈ నెల 14న విడుదల కానుంది. దీంతో ఫస్ట్ డేనే తమ ఉద్యోగులు రజినీ సినిమా చూసేందుకు యూనో ఆక్వా కేర్ అనే సాఫ్ట్‌వేర్ సంస్థ సెలవు ప్రకటించింది. చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునల్వేలి, మధురై, చెంగల్పట్టు, అరపాలయం, మట్టుతవానిల్లో ఉన్న అన్ని బ్రాంచీలకు సెలవు వర్తిస్తుందని సర్క్యులర్ పంపింది. తమ ఉద్యోగుల వినతి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.