News March 22, 2024

మనుషులు కాదు.. క్రూర మృగాలు

image

AP: ధన దాహంతో మనుషులు క్రూర మృగాళ్లలా మారుతున్నారు. బంగారు నగల కోసం ఓ వృద్ధురాలని ముక్కలుగా నరికి చంపేశారు. అనంతపురం(D) ఎర్రగుంట్లలో ఈ దారుణం జరిగింది. ఓబులమ్మ(84) అనే వృద్ధురాలు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి ఇంట్లో శుభకార్యం కోసం 7తులాల బంగారం ఇచ్చింది. వారు తిరిగి ఇవ్వకపోవడంతో పెద్దలను ఆశ్రయించింది. దీంతో కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు గొడవకు దిగి ఆమెను ముక్కలుగా నరికి పెనకచర్ల డ్యామ్‌లో పడేశారు.

Similar News

News April 20, 2025

విమానాన్ని ఢీకొట్టిన టెంపో వ్యాన్!

image

బెంగళూరు ఎయిర్‌పోర్టులో నిలిచి ఉన్న ఇండిగో విమానాన్ని ఓ టెంపో వ్యాన్ ఢీకొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విమానం కింద వ్యాన్ ఇరుక్కున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఘటనపై ఇండిగో స్పందించింది. ‘బెంగళూరులో జరిగిన ఘటన మా దృష్టికి వచ్చింది. దర్యాప్తు జరుగుతోంది. అది పూర్తైన అనంతరం తగిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొంది. టెంపో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

News April 20, 2025

వర్షం మొదలైంది..

image

TG: హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మేడ్చల్, తుర్కపల్లి, శామీర్‌పేట, ఆలియాబాద్, తూముకుంట, కీసరలో వర్షం పడుతోంది. రాబోయే గంట నుంచి రెండు గంటల్లో HYDతో పాటు నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

News April 20, 2025

మీ శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా?

image

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు పెరుగుతున్నాయి. అధిక వేడి కారణంగా కొందరు వడదెబ్బకు గురై అవస్థలు పడుతున్నారు. వడదెబ్బ తగిలిన వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీలకంటే ఎక్కువగా ఉంటుంది. జ్వరం, తలనొప్పి, తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. వాంతులు, వికారంతోపాటు గుండె వేగంగా కొట్టుకుంటుంది. శరీరంలో మార్పులు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

error: Content is protected !!