News June 17, 2024
టీడీపీలో చేరడం లేదు: YCP MLA

AP: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కర్నూలు జిల్లా ఆలూరు YCP MLA విరూపాక్షి ఖండించారు. ‘YCP టికెట్పై గెలిచి టీడీపీలోకి వెళ్లేందుకు నా ఆత్మసాక్షి ఎలా ఒప్పుకుంటుంది? నేను పార్టీ మారడం లేదు. YSR ఆశయాల కోసం జగన్ పట్టుదలను చూసి YCPలో చేరాను. జగన్ నన్ను MLAగా నిలబెట్టి గెలిపించారు. ప్రతిపక్షంలో ఉంటూ పోరాటం చేస్తా. వదంతులు నమ్మవద్దు’ అని కోరారు.
Similar News
News December 11, 2025
ఆయుర్వేద స్నానం గురించి తెలుసా?

చాలామంది పనుల హడావుడిలో త్వరత్వరగా స్నానం ముగించేస్తుంటారు. కానీ శరీరానికి కలిగిన శ్రమను మర్చిపోయేలా చేసేదే నిజమైన స్నానం. ఆయుర్వేదం ప్రకారం స్నానం చేసే నీళ్లల్లో కొన్ని పదార్థాలు కలిపి చేస్తే హాయిగా ఉంటుంది. స్నానం చేసే నీటిలో కాస్త గంధం పొడి, మల్లెలు, గులాబీ రేకలు వేసుకుని చేస్తే ఒళ్లంతా చక్కని సువాసన వస్తుంది. కమలాపండు, నిమ్మతొక్కలను వేడినీళ్లలో వేసుకుని స్నానం చేస్తే శరీరం తేలిగ్గా అవుతుంది.
News December 11, 2025
మీకంటే అసద్ యాక్టివ్: T BJP ఎంపీలతో మోదీ

తెలంగాణలో BJP MPలు సరైన ప్రతిపక్షపాత్ర పోషించలేకపోతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అసంతృప్తి వ్యక్తంచేశారు. అసదుద్దీన్ సోషల్ మీడియా టీమ్ యాక్టివ్గా ఉందని ఉదహరించారు. వారి పనితీరు మారాలని, SMలో చురుగ్గా ఉండాలని హితబోధ చేశారు. AP, TGల NDA MPలకు అల్పాహార విందులో మోదీ ఈ కామెంట్స్ చేశారు. ఏపీలో చంద్రబాబు పాలన భేష్ అంటూ ఈ భేటీలో కితాబు ఇచ్చారు. అందుకే ఏపీకి పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయన్నారు.
News December 11, 2025
చేపల చెరువుల్లో నీటి నాణ్యత కోసం సూచనలు

చేపల చెరువుల్లో పాడిల్ వీల్ ఎరేటర్లు వాడటం ద్వారా చెరువుల్లో ప్రాణ వాయువును పెంచుకోవచ్చు. పరిమితికి మించి చెరువులో చేప పిల్లలను వదలకూడదు. అలాగే చేపల సంఖ్యను బట్టి ఆహారం వేయాలి. ఎక్కువగా వేస్తే చేపలు తినగా మిగిలిన ఆహారం కుళ్లిపోయి చెరువులో ప్రాణ వాయువు పరిమాణాన్ని తగ్గిస్తుంది, అమ్మోనియా మోతాదును పెంచుతుంది. అలాగే చెరువులో పెరిగే కలుపు మొక్కలను నివారిస్తే నీటి నాణ్యత మెరుగుపడుతుంది.


