News September 6, 2024
నాలాగా కాదు.. ఇంకా గొప్పోళ్లు కావాలి: ఇన్ఫోసిస్ మూర్తి

తన స్టేట్‌మెంట్స్‌తో వార్తల్లో నిలిచే ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ‘టీచ్ ఫర్ ఇండియాస్ లీడర్స్’ ప్రోగ్రాంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనలా కావొద్దని విద్యార్థులకు సూచించారు. ఈవెంట్‌లో ఓ 12 ఏళ్ల విద్యార్థి ‘మీలా కావాలంటే ఏం చేయాలి’ అని మూర్తిని ప్రశ్నించాడు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘మీరు నాలా కావడం నాకిష్టం లేదు. దేశానికి మరింత మేలు చేసేలా నాకంటే గొప్పవాళ్లు కావాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు.
Similar News
News March 3, 2025
దేశంలో మహిళలకు 48% పెరిగిన JOBS

దేశంలో 2024తో పోలిస్తే 2025లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు 48% పెరిగాయని foundit తెలిపింది. ఎమర్జింగ్ టెక్నాలజీ రోల్స్ సహా IT, BFSI, తయారీ, హెల్త్‌కేర్ రంగాల్లో వృద్ధి ఇందుకు దోహదం చేసినట్టు పేర్కొంది. ‘భారత జాబ్ మార్కెట్ రాకెట్ వేగంతో పెరుగుతోంది. స్త్రీలకు యాక్సెస్, ఆపర్చునిటీస్ గణనీయంగా పెరిగాయి’ అని ఫౌండిట్ VP అనుపమ తెలిపారు. ఆఫీసుల్లో వారి కోసం ఏర్పాట్లు 55% మేర పెరగడం గుర్తించామన్నారు.
News March 3, 2025
ఏపీ ఎక్కువ నీరు తీసుకుంటోంది.. అడ్డుకోండి: రేవంత్

TG: కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని, ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ కేంద్రమంత్రి CR పాటిల్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. కృష్ణా బేసిన్ నుంచి ఏపీ ఎక్కువ నీటిని తీసుకుంటోందని, దాన్ని అడ్డుకోవాలని కోరినట్లు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్ట్‌పై తాము అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెప్పారు.
News March 3, 2025
3 రాజధానుల విధానంపై చర్చించి చెబుతాం: బొత్స

AP: రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై YCP సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మూడు రాజధానులనేది ఆ రోజుకు మా విధానం. దానిపై ఇప్పుడు మా విధానం ఏంటనేది పార్టీలో చర్చించి చెబుతాం. అమరావతిని శాసన రాజధాని చేద్దామని అనుకున్నాం. అమరావతి శ్మశానంలా ఉందని నేను చెప్పింది వాస్తవమే. ఆరేళ్ల క్రితం అప్పటి సందర్భం మేరకు అలా మాట్లాడాను’ అని బొత్స తెలిపారు.