News October 23, 2025

పరాక్రమమే కాదు.. దయ కూడా ఉండాలి!

image

పాతాళ లోకాన్ని పాలించే బలి చక్రవర్తి కీర్తి ఓనాడు రావణుడి వద్దకు చేరింది. దీంతో బలిని సవాలు చేయడానికి పాతాళానికి వెళ్లాడు. కానీ రాజ భవనంలో రావణుడికి పరాభావం ఎదురైంది. పిల్లలే ఆయనను బంధించి, ఎగతాళి చేశారు. అది చూసిన బలి చక్రవర్తి, రావణుడిపై జాలిపడి, క్షమించి వదిలిపెట్టాడు. అహంకారంతో వచ్చిన రావణుడు పోరాడకుండానే వెనుతిరిగాడు. పరాక్రమంతో పాటు దయ కలిగి ఉండటమే నిజమైన రాజ లక్షణమని బలి నిరూపించాడు.

Similar News

News October 23, 2025

విమానాల్లో పవర్ బ్యాంకులపై నిషేధం!

image

డొమిస్టిక్ విమానాల్లో పవర్ బ్యాంకులను నిషేధించే విషయాన్ని DGCA పరిశీలిస్తోంది. ఇటీవల ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంకు నుంచి మంటలు చెలరేగగా సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో వాటిని నిషేధించడం లేక తక్కువ సామర్థ్యం ఉన్నవాటిని అనుమతించడంపై పరిశీలన చేస్తోంది. త్వరలోనే మార్గదర్శకాలు ఇచ్చే అవకాశముంది. అటు పలు ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో పవర్ బ్యాంకుల వినియోగంపై నిషేధం ఉంది.

News October 23, 2025

జూబ్లీహిల్స్‌లో రౌడీషీటర్‌ను ఓడించండి: KCR

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మాగంటి సునీత గెలుపును ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని BRS చీఫ్ KCR పేర్కొన్నారు. ‘భారీ మెజారిటీ కోసం గట్టి ప్రయత్నం చేయాలి. రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని ప్రజలు చిత్తుగా ఓడించి HYDలో శాంతి భద్రతలను కాపాడుకుంటారని విశ్వసిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. మాగంటి సునీత గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై నేతలకు KCR దిశా నిర్దేశం చేశారు.

News October 23, 2025

TET తీర్పుపై సమీక్షకు సుప్రీంలో పిటిషన్: APTF

image

AP: TETపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ సమీక్ష కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు ఏపీటీఎఫ్ తెలిపింది. ‘2017లో కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారం RTE-2010కి పూర్వం ఉన్న టీచర్లు కూడా TET పాస్ కావాలని సుప్రీం తీర్పిచ్చింది. అయితే అప్పటి టీచర్లకు టెట్‌ను వర్తింపచేయడం వల్ల కొంత ఇబ్బంది అవుతోంది. 2010కి ముందున్న టీచర్లను దీని నుంచి మినహాయించేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి’ అని విన్నవించింది.