News June 20, 2024
అఫ్గానిస్థాన్‌తో అంత ఈజీ కాదు
T20 వరల్డ్ కప్ సూపర్-8లో రోహిత్ సేన అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా లీగ్ దశలో న్యూజిలాండ్‌కు షాకిచ్చిన అఫ్గాన్‌ను భారత్ తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. దీంతో భారత జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు లీగ్ దశలో విఫలమైన కింగ్ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు.
Similar News
News February 3, 2025
ఓసీల జనాభా పెరిగి బీసీల జనాభా తగ్గుతుందా?: MLC కవిత
BCల జనాభాపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకిలెక్కలు చెబుతోందని, గతంతో పోల్చితే వారి జనాభా ఎలా తగ్గుతుందని MLC కవిత విమర్శించారు. ‘TGలో ఏ లెక్కన చూసినా 50-52% BCలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ప్రభుత్వం 46.2% ఉన్నట్లు తేల్చడం బాధాకరం. సకల జనుల సర్వేకు, ఇప్పటి సర్వేకు 21 లక్షల BC జనాభా తేడా కనిపిస్తోంది. OCల జనాభా ఎక్కువ కనిపిస్తోంది. కేవలం ఓసీల జనాభా పెరిగి బీసీల, SC, ST జనాభా తగ్గుతుందా?’ అని ప్రశ్నించారు.
News February 3, 2025
డబ్బుల్లేక సన్యాసం తీసుకున్నా: మాజీ హీరోయిన్
ఆర్థిక కష్టాలతో తాను సన్యాసం తీసుకున్నానని మాజీ హీరోయిన్ మమతా కులకర్ణి అన్నారు. ‘కిన్నెర అఖాడా మహామండలేశ్వర్ కోసం నేను రూ.కోట్లు ఇచ్చానంటున్నారు. నా వద్ద రూ.10cr కాదు కదా రూ.కోటి కూడా లేదు. ప్రభుత్వం నా బ్యాంకు ఖాతాలు సీజ్ చేసింది. చేతిలో రూపాయి లేకుండా జీవితాన్ని ఎలా నెట్టుకొస్తున్నానో నాకే తెలియదు’ అని కన్నీటి పర్యంతమయ్యారు. ఈమెను మహామండలేశ్వర్‌గా నియమించి వెంటనే బహిష్కరించిన విషయం తెలిసిందే.
News February 3, 2025
కోహ్లీని ఎలా ఔట్ చేయాలో బస్ డ్రైవర్ చెప్పాడు: సాంగ్వాన్
ఇటీవల రంజీ మ్యాచ్‌లో కోహ్లీని ఔట్ చేసిన H.సాంగ్వాన్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘ఢిల్లీ తరఫున పంత్, కోహ్లీ ఆడతారనుకున్నాం. ఆ తర్వాత కోహ్లీ మాత్రమే బరిలోకి దిగుతున్నారని, మ్యాచ్ టెలికాస్ట్ అవుతున్నట్లు తెలిసింది. ఆ సమయంలో మా బస్సు డ్రైవర్ విరాట్‌కు ఫోర్త్ లేదా ఫిఫ్త్ స్టంప్ బాల్ వేస్తే ఔట్ అవుతారన్నారు. కానీ నేను నా ప్లాన్ ప్రకారం బౌల్ చేశా’ అని చెప్పారు. ఈ మ్యాచ్‌లో విరాట్ 6పరుగులే చేశారు.