News October 21, 2025
ట్రంపే కాదు.. ఆయన సెక్రటరీ అంతే!

US ప్రెసిడెంట్ ట్రంప్ నోటి దురుసు గురించి తెలిసిందే. ఈ విషయంలో తానేం తక్కువ కాదని వైట్‌హౌస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ నిరూపించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించేందుకు త్వరలో ట్రంప్, పుతిన్ హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో భేటీ కానున్నారు. ఈ హైలెవెల్ సమ్మిట్‌కు ఆ లొకేషన్ ఎవరు ఎంపిక చేశారని ఓ జర్నలిస్ట్ కరోలిన్‌కు మెసేజ్ చేశారు. ‘మీ అమ్మ చేసింది’ అని ఆమె బదులివ్వడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
Similar News
News October 21, 2025
నాగర్ కర్నూల్‌లో పోలీసు అమరవీరుల ర్యాలీ

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ‘పోలీస్ అమరవీరులకు జోహార్’ అంటూ నినాదాలు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు అర్పించిన అమరుల సేవలను జాతి ఎన్నటికీ మరువబోదని వారు పేర్కొన్నారు.
News October 21, 2025
డాక్టరేట్ సాధించిన మొదటి భారతీయ మహిళ ఆసిమా ఛటర్జీ

సైన్స్‌లో డాక్టరేట్ పొందిన మొదటి భారతీయ మహిళ ఆసిమా ఛటర్జీ. పైటోమెడిసిన్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో నిపుణురాలైన ఈమె మూర్చ, మలేరియా మందులు అభివృద్ధి చేశారు. కలకత్తా యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీ విభాగంలో ఖైరా ప్రొఫెసర్‌షిప్ పొందారు. అక్కడ పలు విభాగాల్లో ప్రత్యేక హోదా పొందారు. 1960లో జాతీయ సైన్స్ అకాడమీ ఫెలోషిప్, 1961లో కెమిస్ట్రీలో చేసిన కృషికి ‘శాంతి స్వరూప్ భట్నాగర్’ అవార్డు పొందారు.
News October 21, 2025
అమెరికన్ చెస్ గ్రాండ్‌మాస్టర్ కన్నుమూత

అమెరికన్ చెస్ గ్రాండ్‌మాస్టర్ డానియెల్ నరోడిట్స్కీ(29) కన్నుమూశారు. ‘టాలెంటెడ్ చెస్ ప్లేయర్, ఎడ్యుకేటర్, చెస్ కమ్యూనిటీలో ప్రియమైన సభ్యుడు తుదిశ్వాస విడిచారు’ అని నార్త్ కరోలినాలోని చార్లెట్ చెస్ క్లబ్ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. అయితే ఆయన మృతికి గల కారణాలు వెల్లడించలేదు. 18 ఏళ్లకే డానియెల్ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించారు. ఆయన అండర్-12 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌గా నిలిచారు.