News November 4, 2024
HDFC బ్యాంక్ ఖాతాదారులకు గమనిక

హెచ్డీఎఫ్సీ బ్యాంకు యూపీఐ లావాదేవీలకు ఈ నెల 5, 23 తేదీల్లో అంతరాయం కలగనుంది. 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు, 23వ తేదీ 12 గంటల నుంచి 3గంటల వరకు సిస్టమ్స్ నిర్వహణ కారణంగా యూపీఐ చెల్లింపులు చేయలేరని ఆ బ్యాంకు తెలిపింది. అలాగే దుకాణదారులు సైతం యూపీఐ సేవలు పొందలేరని పేర్కొంది.
Similar News
News November 24, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచుల రిజర్వేషన్లు ఖరారు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచుల రిజర్వేషన్లు అధికారికంగా ఖరారయ్యాయి.
మొత్తం 260 పంచాయతీలు ఉండగా..
63 జనరల్,
58 జనరల్ మహిళ..
29 బీసీ జనరల్,
24 బీసీ మహిళ..
32 ఎస్సీ జనరల్,
24 ఎస్సీ మహిళ..
17 ఎస్టీ జనరల్,
13 ఎస్టీ మహిళ స్థానాలుగా నిర్ణయించారు. మొత్తం మీద 121 పంచాయతీలు జనరల్ అభ్యర్థులకు, బీసీలకు 53, ఎస్సీలకు 56, ఎస్టీలకు 30 పంచాయితీలు దక్కనున్నాయి.
News November 24, 2025
స్థానిక ఎన్నికల తేదీలపై 25న క్యాబినెట్ నిర్ణయం!

TG: కోర్టుల ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికల్లో 50%లోపు రిజర్వేషన్లను ఖరారు చేశారు. పంచాయతీల రిజర్వేషన్లపై ఇవాళ కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేస్తారు. కాగా హైకోర్టు ఉత్తర్వులను బట్టి షెడ్యూలు, నోటిఫికేషన్ విడుదలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మూడు దశల్లో నిర్వహణకు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ నెల 25న జరిగే మంత్రివర్గ భేటీలో తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది.
News November 24, 2025
ఫ్లైట్లో ఈ 10 వస్తువులు నిషేధం అని తెలుసా?

విమాన ప్రయాణాలు చేసేవారు ఈ 10 వస్తువులను క్యారీ చేయకూడదు. కొబ్బరికాయ, కేన్డ్ ఫుడ్ను ఫ్లైట్లో తీసుకెళ్లకూడదు. అధిక పీడనం కారణంగా అవి పగిలిపోయే ప్రమాదం ఉంది. కొబ్బరి ముక్కలు, తురుము తీసుకెళ్లవచ్చు. సాఫ్ట్ చీజ్, విత్తనాలు, ప్రొటీన్ పౌడర్, దురియన్ ఫ్రూట్, నిషేధ రసాయనాలతో తయారు చేసిన మందులు, గ్లో స్టిక్స్, టాయ్ వెపన్స్, స్నో గ్లోబ్స్ను విమానాల్లో తీసుకెళ్లడంపై నిషేధం అమలులో ఉంది.


