News July 26, 2024
విద్యార్థులకు గమనిక.. రేపే లాస్ట్ డేట్

TG: EAPCET రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు జులై 27వ తేదీతో గడువు ముగియనుంది. రేపు, ఎల్లుండి ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 31న సీట్లు కేటాయింపు ఉంటుంది. మొదటి విడతలో మిగిలిన సీట్లతో కలిపి తాజా కౌన్సెలింగ్‌లో మొత్తం 29,777 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తొలి కౌన్సెలింగ్‌లో 75,200 మందికి సీట్లు కేటాయిస్తే 55,941 మంది విద్యార్థులే సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు.
Similar News
News November 27, 2025
స్విగ్గీని బురిడీ కొట్టించిన కస్టమర్.. నెటిజన్ల ఫైర్!

ఆన్లైన్ సైట్స్‌లో వస్తువులు డ్యామేజ్ వస్తే సదరు సంస్థ రీఫండ్ చేయడం చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి డూప్లికేట్ ఫొటోతో ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్’ను బురిడీ కొట్టించాడు. స్విగ్గీలో ఆర్డర్ చేసిన గుడ్ల ట్రే ఫొటోను, జెమిని నానో AI యాప్ ద్వారా గుడ్లు పగిలినట్లుగా ఎడిట్ చేసి కస్టమర్ కేర్‌కు పంపి, పూర్తి రీఫండ్‌ను పొందాడు. ఇలా చేయడం సరికాదని, నిజమైన బాధితులు నష్టపోతారని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
News November 27, 2025
MLC రాజీనామాపై 4 వారాల్లో తేల్చండి: హైకోర్టు

AP: MLC జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖపై నిర్ణయాన్ని తెలపాలని మండలి ఛైర్మన్‌ను హైకోర్టు ఆదేశించింది. రాజీనామాపై సుదీర్ఘకాలం నిర్ణయం తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. విచారణ జరిపి 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. రాజీనామా లేఖ సమర్పించినప్పటికీ చైర్మన్ ఆమోదించడం లేదని జయమంగళ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది.
News November 27, 2025
ఢిల్లీలో మరింత పడిపోయిన గాలి నాణ్యత!

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మరోసారి తీవ్రస్థాయికి చేరింది. నేడు ఉదయం గాలి నాణ్యత AQI 351గా రికార్డైంది. ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాలతోపాటు బురారీ, ఆనంద్ విహార్, చందానీ చౌక్, ఐటీఓ, జహంగీర్ పురి ఏరియాల్లో AQI 300 కంటే ఎక్కువ ఉంది. బుధవారం సాయంత్రం 327 వద్ద ఉన్న గాలి నాణ్యత ఈరోజు ఉదయానికి మరింత దిగజారింది. వరుసగా 21వ రోజు కూడా AQI 300 కంటే ఎక్కువ నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది.


