News July 25, 2024
అంకెల గారడీ తప్ప ఏమీ లేదు: కిషన్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెల గారడీ తప్ప ఏమీ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గిరిజనుల బడ్జెట్ తగ్గించి మైనార్టీలకు పెంచారని ఆరోపించారు. రైతు భరోసాతో సహా ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించలేదని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలుచేయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూ దొందే అని దుయ్యబట్టారు.
Similar News
News December 12, 2025
IIM రాంచీలో నాన్ టీచింగ్ పోస్టులు.. దరఖాస్తు చేశారా?

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రాంచీలో 5 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్, LLB, M.Phil/MA క్లినికల్ సైకాలజీ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. వెబ్సైట్: https://iimranchi.ac.in
News December 12, 2025
18 మెట్లు.. 18 దేవతల ఆశీర్వాదం

అయ్యప్ప దర్శనార్థం శబరిలో 18 మెట్లు ఎక్కిన భక్తులు 18 దేవతల ఆశీస్సులు పొందుతారని, వారి జీవితంలోని కష్టాలు పోతాయని నమ్మకం. ఆ 18 మంది దేవతలు వీరే: 1.మహంకాళి 2.కళింకాళి 3.భైరవ 4.సుబ్రహ్మణ్యం 5.గంధర్వరాజ 6.కార్తవీర్య 7.క్రిష్ణ పింగళ 8.భేతాళ 9.మహిషాసుర మర్దని 10.నాగరాజ 11.రేణుకా పరమేశ్వరి 12.హిడింబ 13.కర్ణ వైశాఖ 14.అన్నపూర్ణేశ్వరి 15.పుళిందిని 16.స్వప్న వారాహి 17.ప్రత్యంగళి 18.నాగ యక్షిణి. <<-se>>#AyyappaMala<<>>
News December 12, 2025
185 ఉద్యోగాలకు నోటిఫికేషన్

నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్లో 185 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. CSA, PO, CA, రిస్క్ ఆఫీసర్, ఐటీ ఆఫీసర్ తదితర 14 కేటగిరీల్లో ఖాళీలున్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, ఎంబీఏ, పీజీ, సీఏ, బీటెక్ పూర్తయిన వారు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 1. ఆన్లైన్ ఎగ్జామ్ జనవరి 18న జరగనుంది.
వెబ్సైట్: https://www.nainitalbank.bank.in/


