News March 21, 2024

ఈ పైశాచిక శక్తికి అవేమీ సరిపోవడంలేదు: రాహుల్

image

కేజ్రీవాల్ అరెస్టుతో ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ‘ఈ భయపడే నియంత ప్రజాస్వామ్యానికి ఉనికి లేకుండా చేస్తున్నాడు. మీడియాతో సహా అన్ని సంస్థలను భయపెట్టడం, పార్టీలను చీల్చడం, కంపెనీల నుంచి డబ్బులు దండుకోవడం, ప్రధాన ప్రతిపక్షం అకౌంట్‌ను ఫ్రీజ్ చేయడం ఈ పైశాచిక శక్తికి సరిపోలేదు. ఇప్పుడు సీఎంలను అరెస్ట్ చేయిస్తున్నాడు. దీనంతటికీ INDIA తగిన సమాధానం చెబుతుంది’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 6, 2025

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్‌లో పోస్టులు

image

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<>HAL<<>>), బెంగళూరు డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు www.mhrdnats.gov.in పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నెల 8 నుంచి 13 వరకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎంపికైన అప్రెంటిస్‌లకు నెలకు రూ.10,900 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://hal-india.co.in/

News December 6, 2025

రబీ వరి నారుమడిలో సస్యరక్షణ ఎలా?

image

వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను చల్లడం వల్ల నాటిన 20-25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించవచ్చు. చలి వాతావరణం వల్ల అగ్గితెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు కట్టడికి లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5ml కలిపి పిచికారీ చేసుకోవాలి.

News December 6, 2025

ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

image

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.