News January 2, 2025

తగ్గేదేలే.. 28 రోజుల్లో రూ.1799 కోట్ల వసూళ్లు

image

‘పుష్ప-2’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 28 రోజుల్లో రూ.1799కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఒక్క హిందీ వెర్షనే రూ.1000 కోట్లు వసూలు చేసింది. మరోవైపు బుక్ మై షోలో ఇప్పటివరకు 19.66M టికెట్లు అమ్ముడుపోయాయి. ఇండియన్ సినిమా చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని సినీ వర్గాలు తెలిపాయి. అల్లు అర్జున్, రష్మిక నటించిన ఈ మూవీని సుకుమార్ తెరకెక్కించిన విషయం తెలిసిందే.

Similar News

News January 23, 2026

టీమ్ ఇండియా ఘన విజయం

image

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఇషాన్ కిషన్(76), కెప్టెన్ సూర్యకుమార్(82) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 209 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఇండియన్ బ్యాటర్లను కట్టడి చేయడంలో NZ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. మ్యాట్ హెన్రీ, జాకబ్, ఇష్ సోథీలకు తలో వికెట్ దక్కింది. ఈ విజయంతో 5 T20ల సిరీస్‌లో ఇండియా 2-0 తేడాతో ఆధిపత్యం కొనసాగిస్తోంది.

News January 23, 2026

యూనస్‌ ఫాసిస్ట్, దేశద్రోహి: షేక్ హసీనా

image

BANలో యూనస్ ప్రభుత్వాన్ని కూలదోయాలని ఆ దేశ మాజీ PM షేక్ హసీనా అన్నారు. ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియాలో ఆమె ఆడియో మెసేజ్‌ను నిర్వాహకులు ప్లే చేశారు. యూనస్‌ను ఫాసిస్ట్, దేశద్రోహిగా, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని విదేశాలకు సేవ చేసే కీలు బొమ్మగా ఆమె అభివర్ణించారు. దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. గతేడాది జరిగిన హింసాత్మక ఘటనలపై UNతో ఇన్వెస్టిగేషన్ చేయించాలన్నారు.

News January 23, 2026

RS ప్రవీణ్ కుమార్‌కు సజ్జనార్ నోటీసులు

image

TG: బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్‌కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నోటీసులు ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని, 2 రోజుల్లో ఇవ్వకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఇవాళ ఉదయం మీడియా సమావేశంలో ప్రవీణ్ మాట్లాడుతూ ‘సజ్జనార్‌పై 7 ట్యాపింగ్ కేసులు ఉన్నాయి. ఆయనపైనే లోతైన విచారణ జరగాలి. ఆయన్ను సిట్ చీఫ్‌గా ఎలా నియమిస్తారు. ఆయన ఎలా ట్యాపింగ్ కేసును విచారిస్తారు?’ అని ప్రశ్నించారు.