News April 10, 2025
ENGకు ఆడటం కంటే ఏదీ ఎక్కువ కాదు: బ్రూక్

ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్గా ఎంపికైన హ్యారీ బ్రూక్ IPL వంటి ఫ్రాంచైజీ టోర్నీల్లో పాల్గొనకపోవడంపై స్పష్టతనిచ్చారు. ‘ENGకు ఆడటానికే నేను ప్రాధాన్యతనిస్తా. దీని కంటే ఏదీ ఎక్కువ కాదు. వేరే టోర్నీల్లో వచ్చే డబ్బును కోల్పోయినా ఫర్వాలేదు. దేశానికి ఆడటాన్నే నేను ఎక్కువగా ఎంజాయ్ చేస్తా’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ IPL సీజన్లో బ్రూక్ DCకి ఆడాల్సి ఉండగా టోర్నీకి ముందు తప్పుకొన్నారు.
Similar News
News December 7, 2025
NDMAలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (<
News December 7, 2025
అత్యాచార బాధితుల కోసం ఓ యాప్

ప్రస్తుతకాలంలో చిన్నారులపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. వీటితో పిల్లలకు ఎంతో మనోవ్యధ కలుగుతోంది. దీన్ని తగ్గించడానికి కేంద్రం POCSO e-box యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఫిర్యాదు చేస్తే బాధితుల వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు నేరస్తులకు శిక్ష పడే వరకు ఈ యాప్ సేవలు అందిస్తుంది. ఈ యాప్ను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. కేసు అప్డేట్స్ కూడా ఇందులో తెలుసుకొనే వీలుంటుంది.
News December 7, 2025
విస్తరిస్తోన్న మార్బర్గ్ వైరస్.. 8 మంది మృతి

దక్షిణ ఇథియోపియాలో ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ వ్యాప్తి చెందుతోంది. డిసెంబర్ 3 నాటికి 13 కేసులు నమోదుకాగా అందులో 8 మంది మృతి చెందినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా ఈ వైరస్ ఎబోలా కుటుంబానికి చెందినదిగా, మరణాల రేటు 88% వరకు ఉండొచ్చని WHO తెలిపింది. ప్రస్తుతం టీకా లేదా ప్రత్యేక చికిత్స అందుబాటులో లేదు. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట వంటి లక్షణాలు ఉంటాయి.


