News August 21, 2024

BGT యాషెస్ కన్నా తక్కువేం కాదు: స్టార్క్

image

ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తమకు యాషెస్ కన్నా తక్కువేమీ కాదని ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ అన్నారు. సొంతగడ్డపై ప్రతి మ్యాచులోనూ టీమ్ఇండియాను ఓడించి సిరీస్‌ను వైట్‌వాష్ చేయడమే తమ లక్ష్యమన్నారు. 2014-15 నుంచి వరుసగా 4సార్లు BGTని గెలిచిన భారత్‌ను అడ్డుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. WTCలో ఈ రెండు జట్లే అగ్రస్థానంలో ఉండటంతో ఆటగాళ్లు, అభిమానులకు సిరీస్ ఆసక్తికరంగా ఉండబోతోందని అంచనా వేశారు.

Similar News

News November 20, 2025

వరంగల్: ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తనిఖీల కోసం చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అనుమతి లేని ఇసుక రవాణాపై కేసులు నమోదు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. విజిలెన్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

News November 20, 2025

జగన్ జైలుకెళ్లడం ఖాయం: మంత్రి సత్యకుమార్

image

AP: పెయిడ్ ఆర్టిస్టులతో జగన్ కోర్టులను మభ్యపెట్టలేరని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. ‘విచారణలో భాగంగా కోర్టులకు హాజరయ్యేవారు వినయంగా వ్యవహరిస్తారు. తాను కోర్టుకు హాజరైతే సమస్యలు ఎదురవుతాయని కోర్టును నమ్మబలికే ప్రయత్నంలో భాగంగానే HYDలో నానా హంగామా చేశారు. జగన్‌లో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు. అక్రమాస్తుల కేసులో ఆయన జైలుకు వెళ్లడం ఖాయం’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

News November 20, 2025

పొగిడిన నోళ్లే తిడుతున్నాయ్.. కరెక్టేనా?

image

రాజమౌళి.. మొన్నటి వరకు తెలుగు సినీ కీర్తిని ప్రపంచ వేదికపై రెపరెపలాడించిన వ్యక్తి. బాలీవుడ్‌ ఆధిపత్యాన్ని ఎదురించి సౌత్ సినిమాను దేశవ్యాప్తం చేసిన డైరెక్టర్. కానీ ఇప్పుడు.. ఆస్కార్ తెచ్చాడని పొగిడిన నోళ్లే నేలకు దించేస్తున్నాయి. ప్రశంసించిన వాళ్లే విమర్శిస్తున్నారు. ‘దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు’ అన్న ఒకేఒక్క మాట జక్కన్నను పాతాళానికి పడేసిందా? అంతరాత్మ ప్రభోదానుసారం మాట్లాడటం తప్పంటారా? COMMENT