News September 15, 2024

రాజీనామాలతో ఒరిగేదేం లేదు: బొత్స

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్‌పై ప్రభుత్వం తమ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తామంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల రాజీనామాల వల్ల ఒరిగేది లేదు. ఎన్నికలకు ముందు పవన్, చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి’ అని చెప్పారు.

Similar News

News January 13, 2026

చైనా మాంజాపై పోలీసు కమిషనర్‌కు HRC నోటీసులు

image

TG: గాలిపటాలు ఎగురవేసేందుకు వినియోగిస్తున్న చైనా మాంజా కారణంగా పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు. తీవ్రంగా గాయపడి కొన్నిచోట్ల పిల్లల ప్రాణాలూ పోతున్నాయి. దీనిపై దాఖలైన ఫిర్యాదుతో తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) సీరియస్‌గా స్పందించింది. HYD పోలీసు కమిషనర్ సజ్జనార్‌కు నోటీసులు జారీచేసింది. ఈ ఘటనలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అడ్వకేట్ రామారావు ఇమ్మానేని HRCలో ఈ పిటిషన్ దాఖలు చేశారు.

News January 13, 2026

Xలో సాంకేతిక సమస్య!

image

సోషల్ మీడియా మాధ్యమం X(ట్విటర్)లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. యాప్ లోడ్ అవట్లేదని నెటిజన్లు చెబుతున్నారు. ఒక వేళ ప్రయత్నిస్తే Retry అని డిస్ ప్లే అవుతుందని అంటున్నారు. అయితే ఈ సమస్య భారత్‌లోనే ఉందా ఇతర దేశాల్లోనూ ఉందా అనేది తెలియాల్సి ఉంది. మీకు ఇలాంటి సమస్య ఎదురవుతుందా? కామెంట్.

News January 13, 2026

TCSలో మరిన్ని ఉద్యోగాల కోత!

image

TCSలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. 6 నెలల్లో 30 వేల మందిని ఇంటికి పంపిన కంపెనీ అవసరమైతే మరింత మందిని తీసేస్తామని చెప్పింది. ‘నంబర్ ఇంత అని నిర్ణయించలేదు. కానీ వచ్చే త్రైమాసికంలోనూ తొలగింపులు ఉంటాయి. సరైన కారణం, అంతర్గత ఆడిట్ ద్వారానే ఇవి జరుగుతాయి’ అని తెలిపింది. ప్రస్తుతం TCSలో 5,82,163 మంది పని చేస్తున్నారు. సెప్టెంబర్ క్వార్టర్‌లో 19,755 మంది, డిసెంబర్ క్వార్టర్‌లో 11,151 మందిని తీసేసింది.