News October 25, 2024

వారితో నటించడంలో తప్పేమీ లేదు: ఊర్వశీ రౌతేలా

image

తన కంటే రెట్టింపు వయసున్న హీరోలతో నటించడంలో తప్పేమీ లేదని హీరోయిన్ ఊర్వశీ రౌతేలా అన్నారు. ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాలో సన్నీ డియోల్ సరసన నటించిన సమయంలో తన ఏజ్ 19 ఏళ్లని చెప్పారు. వయసు పరంగా హీరోకు తనకు మధ్య వ్యత్యాసం 38 ఏళ్లని తెలిపారు. అయితే కథకు అనుగుణంగా నటించడంలో ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న NBK 109లో కీలక పాత్రలో నటిస్తున్నారు.

Similar News

News February 4, 2026

ఆదాయం ఆపేస్తాం.. పాకిస్థాన్‌కు ICC లీగల్ వార్నింగ్!

image

భారత్‌తో మ్యాచ్ ఆడబోమని మొండికేస్తున్న పాక్‌కు ICC నుంచి గట్టి షాక్ తగిలేలా ఉంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన T20 WC మ్యాచ్‌ను బహిష్కరిస్తే.. పాక్‌కు ICC నుంచి వచ్చే దాదాపు ₹300 కోట్ల యాన్యువల్ రెవెన్యూని నిలిపేస్తామని హెచ్చరించింది. బ్రాడ్‌కాస్టర్ జియోహాట్‌స్టార్ నష్టపరిహారం కోరుతూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని, అదే జరిగితే ఆ మొత్తాన్ని పాక్ ఆదాయం నుంచే రికవర్ చేస్తామని తేల్చి చెప్పింది.

News February 4, 2026

ఆన్‌లైన్ గేమ్ పిచ్చి: ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

image

ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు ఘజియాబాద్‌(UP)లో వారు నివసిస్తున్న బిల్డింగ్ 9వ అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు. బుధవారం వేకువజామున 2గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. కరోనా నుంచి వీరు ఒక కొరియన్ టాస్క్ బేస్డ్ గేమ్‌కు అడిక్ట్ అయ్యారు. చదువు మానేసి మరీ గేమ్స్ ఆడుతుండటంతో పేరెంట్స్ మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ముగ్గురూ ఒకేసారి బిల్డింగ్ పైనుంచి దూకేశారు.

News February 4, 2026

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో సీనియర్ ఇంజినీర్ పోస్టులు

image

<>భారత్ <<>>ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బెంగళూరు 4 సీనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి BE/BTech (ఏరోస్పేస్/ఏరోనాటికల్ ఇంజినీరింగ్), ME/MTech అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఫిబ్రవరి 24వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://bel-india.in