News November 29, 2024

క్యాన్సర్ ట్రీట్‌మెంట్.. సిద్ధూకు ₹850cr చెల్లించాలని నోటీసు

image

డైట్ కంట్రోల్‌తో తన భార్యకు స్టేజ్-4 క్యాన్సర్ నయమైందన్న మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూకు ఛత్తీస్‌గఢ్ సివిల్ సొసైటీ లీగల్ నోటీసు పంపింది. 7రోజుల్లోగా ఆయన తన భార్య మెడికల్ ట్రీట్‌మెంట్ డాక్యుమెంట్స్‌ను సమర్పించాలని పేర్కొంది. సిద్ధూ వ్యాఖ్యలు క్యాన్సర్ బాధితులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే ₹850cr పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Similar News

News February 10, 2026

ఉపవాసం: ఈ నియమాలు మీకు తెలుసా?

image

పగలు, రాత్రి భోజనం చేయకపోవడాన్ని ‘ఉపవాసం’ అంటారు. మధ్యాహ్నమే భుజించడం ‘ఏకభుక్తం’. రాత్రి మాత్రమే తినడం ‘నక్తం’. ఉపవాస సమయంలో పగటి నిద్ర, తాంబూలం, క్రోధం, కంటనీరు వంటివి వ్రత భంగాన్ని కలిగిస్తాయి. గురువు ఆజ్ఞ, ఔషధ సేవ, జలం తీసుకోవడం నిషిద్ధం కాదు. ఏ దేవత కోసం వ్రతం చేస్తున్నామో ఆ దైవ మంత్రాన్ని జపిస్తూ, కథా శ్రవణం, పూజలతో రోజంతా గడపాలి. పరాన్న భోజనం విడిచి, మనస్సును పూర్తిగా దైవచింతనలో ఉంచాలి.

News February 10, 2026

ఉపవాసంతో ఎన్ని ప్రయోజనాలో..

image

ఉపవాసంతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభించి అజీర్ణం తొలగుతుంది. శరీరంలోని విషతుల్యాలు, మాలిన్యాలు వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. ఊపిరితిత్తులలోని నీరును, గుండె చుట్టూ ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. తద్వారా శ్వాసక్రియ మెరుగుపడుతుంది. కాలేయ పనితీరు మెరుగుపడి చర్మం కాంతివంతంగా మారుతుంది. జలుబు, జ్వరాల వంటి వ్యాధుల నుంచి త్వరగా కోలుకోవడానికి ఇదొక సహజ చికిత్సలా పనిచేస్తుంది.

News February 10, 2026

BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ల శాలరీలివే!

image

భారత క్రికెట్ జట్టు ప్లేయర్లకు <<19095739>>BCCI<<>> తాజాగా 3 గ్రేడ్లలో చోటు కల్పించిన విషయం తెలిసిందే. గ్రేడ్-Aలో ఉన్న ఆటగాళ్లకు రూ.5కోట్లు చెల్లించనుంది. గ్రేడ్-B క్రికెటర్లకు రూ.3 కోట్లు, గ్రేడ్-C క్రికెటర్లకు రూ. కోటి చొప్పున ఇవ్వనుంది. దీంతో పాటు మ్యాచ్ ఫీజులు అదనం. తాజా కాంట్రాక్ట్‌లో గ్రేడ్‌-Bకు డిమోట్ అయిన రోహిత్, విరాట్ రూ.3 కోట్ల చొప్పున అందుకోనున్నారు. గతంలో ఉన్న A+ గ్రేడ్‌ను BCCI తొలగించింది.