News August 25, 2024

225 విల్లాలకు నోటీసులు

image

TG: హైదరాబాద్ మణికొండలోని చిత్రపురి కాలనీలో 225 విల్లాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. జీవో 658కి విరుద్ధంగా 225 ROW హౌసులు నిర్మించారని, జీ+1కి పర్మిషన్ తీసుకుని జీ+2 కట్టారని పేర్కొన్నారు. 15 రోజుల్లోగా నోటీసులకు రిప్లై ఇవ్వాలని స్పష్టం చేశారు. గత పాలకుల నిర్ణయాలతో చిత్రపురి సొసైటీకి రూ.50 కోట్ల నష్టం జరిగిందంటూ ఫిర్యాదు అందడంతో అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు.

Similar News

News January 27, 2025

ఆ సినిమా చూసే.. భార్యను ముక్కలుగా నరికాడు

image

మలయాళ క్రైమ్, థ్రిల్లర్ ‘సూక్ష్మదర్శిని’ సినిమా స్ఫూర్తితోనే తన భార్య మాధవిని హత్య చేసినట్లు గురుమూర్తి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో దత్తత తీసుకున్న కూతురిని తల్లి, కుమారుడు కలిసి హత్య చేస్తారు. ఆమె మృతదేహాన్ని మాయం చేసేందుకు శరీర భాగాలను ఓ ట్యాంకులో వేసి కెమికల్స్ పోసి కరిగిస్తారు. ఆ నీళ్లను వాష్ రూమ్ ఫ్లష్ ద్వారా వదులుతారు. ఆ మూవీలో చేసినట్లే గురుమూర్తి కూడా మాయం చేశాడు.

News January 27, 2025

ఆర్టీసీలో సమ్మె సైరన్

image

TG: ఆర్టీసీలో ఇవాళ్టి నుంచి సమ్మె సైరన్‌ మోగనుంది. ప్రైవేటు ఎలక్ట్రిక్‌ బస్సుల విధానాన్ని పునఃసమీక్షించి, తమ సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్లతో సమ్మెకు వెళ్లాలని నిర్ణయించినట్టు ఆర్టీసీ జేఏసీ తెలిపింది. నేటి సాయంత్రం 4 గంటలకు బస్‌భవన్‌లో యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేయనుంది. కాగా ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులతో సంస్థలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని జేఏసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

News January 27, 2025

ట్రంప్ 2.0: ప్రపంచ శాంతికి మేలేనన్న భారతీయులు

image

అమెరికా ప్రెసిడెంటుగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికవ్వడంపై మెజారిటీ భారతీయులు సానుకూలంగా ఉన్నారని ECFR సర్వే పేర్కొంది. ‘Trump Welcomers’ కేటగిరీలో వారే ఎక్కువగా ఉన్నారని తెలిపింది. ఆయన గెలుపు ప్రపంచ శాంతికి మేలని 82, భారత్‌కు మంచిదని 84, US పౌరులకు మంచిదని 85% భారతీయులు అన్నారు. చైనా, తుర్కియే, బ్రెజిల్‌ పౌరులూ ఇలాగే భావిస్తున్నారు. EU, UK, AUSలో ఎక్కువగా ‘Never Trumpers’ కేటగిరీలో ఉన్నారు.