News August 30, 2024

వారికేమో నోటీసులు.. వీరికేమో కూల్చివేతలు!

image

TG: తెలంగాణలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే ఎంత పెద్దవారైనా చర్యలు తప్పవని ప్రభుత్వం చెబుతోంది. అలాగే కొందరు ప్రముఖుల భవనాలను కూల్చివేయించింది కూడా. అయితే ప్రముఖులకు నోటీసులతో సరిపెట్టి, పేదలకు మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా ఇళ్లు కూలుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.

Similar News

News January 21, 2026

‘అగ్రిటెక్’తో వ్యవసాయ రంగంలో మార్పులు: CBN

image

AP: అగ్రిటెక్ విధానం అమలుతో రాష్ట్ర వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయని CBN తెలిపారు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఏదైనా సాధ్యమని నమ్ముతాను. విశాఖకు గూగుల్ సంస్థ రాక గొప్ప ముందడుగు. దీని కోసం లోకేశ్ ఎంతో కష్టపడ్డారు. గ్రీన్ ఎనర్జీ, అమ్మోనియా గురించి లోకం చర్చిస్తున్న సమయంలో AP ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తోంది. అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దుతున్నాం’ అని దావోస్‌లో మీడియాతో పేర్కొన్నారు.

News January 21, 2026

మిర్చికి రికార్డ్ స్థాయిలో ధర

image

గుంటూరు మిర్చి మార్కెట్‌లో ఇవాళ రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. యార్డుకు 46 వేల బస్తాల సరకు రాగా, అన్ని రకాలకు మంచి ధర లభించింది. ముఖ్యంగా 2043 రకం క్వింటాలుకు రూ.30,000( ఏసీ సరుకు క్వింటాల్ రూ.35,000) వరకు రికార్డు స్థాయి ధర పలికింది. మిరప 341 రకం గరిష్ఠంగా క్వింటాకు రూ.25,000, నెంబర్ 5 రకం రూ.22,000-23,000, బంగారం, బుల్లెట్ రకాలు రూ.21,000-22,000, తేజ రకం రూ.19,500-20,000 వరకు ధర పలికాయి.

News January 21, 2026

విస్కీలకు ర్యాంకులు! లిస్ట్‌లో ఇండియన్ బ్రాండ్!!

image

ప్రపంచంలో విస్కీలకు ర్యాంకింగ్స్ ఇచ్చే జిమ్ ముర్రే విస్కీ బైబిల్ 2025-26 రిలీజైంది. ఇందులో World Whiskey of the year టైటిల్ USAకు చెందిన ఫుల్ ప్రూఫ్ 1972 బౌర్బన్, టాప్ సింగిల్ మాల్ట్ స్కాచ్‌గా గ్లెన్ గ్రాంట్, రెడ్‌బ్రెస్ట్, భారత్‌కు చెందిన పాల్ జాన్ ఉన్నాయి. ఇక కర్ణాటకకు చెందిన అమృత్ డిస్టిలరీస్ Expedition (15Y. old Single Malt) మోస్ట్ ఫైనెస్ట్ విస్కీ ర్యాంక్3ని పొందింది. దీని ధర రూ.10 లక్షలు.