News January 27, 2025
ఫిబ్రవరి 9 నుంచి బస్సులు బంద్ అంటూ నోటీసులు

TG: హైదరాబాద్ RTC X రోడ్డులోని బస్‌భవన్‌లో RTC యాజమాన్యానికి కార్మిక సంఘాల JAC సమ్మె నోటీస్ ఇచ్చింది. తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ప్రభుత్వంలో విలీనం, 2PRCలు, CCS, పీఎఫ్ డబ్బులు రూ.2700 కోట్ల చెల్లింపులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసింది. డిమాండ్లు నెరవేర్చకుంటే ఫిబ్రవరి 9 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తూ ఆర్టీసీ యాజమాన్యానికి ఇచ్చిన నోటీసుల్లో స్పష్టం చేసింది.
Similar News
News November 12, 2025
గజం రూ.3.40 లక్షలు.. 8 ఏళ్లలో 4 రెట్లు

TG: రాయదుర్గంలోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ(HKC)లో గజం ధర రూ.3.40 లక్షలు పలికినట్లు TGIIC ఎండీ శశాంక తెలిపారు. 2017లో అక్కడ రూ.88వేలుగా ఉన్న ధర ప్రస్తుతం నాలుగు రెట్లు పెరిగినట్లు వెల్లడించారు. మొత్తం 4,770 గజాల స్థలాన్ని రూ.159 కోట్లకు విక్రయించామన్నారు. ఇక కోకాపేట, మూసాపేటలోని ఖాళీ ప్లాట్ల వేలం కోసం ప్రీబిడ్ సమావేశం ఈ నెల 17న టీహబ్‌లో నిర్వహించనున్నట్లు HMDA ప్రకటించింది.
News November 12, 2025
GOOD NEWS: ఎల్లుండి నుంచి ‘సదరం’ స్లాట్ బుకింగ్

APలోని దివ్యాంగులకు శుభవార్త. వారి వైకల్య నిర్ధారణకు ఈ నెల 14 నుంచి సదరం స్లాట్ బుకింగ్‌ను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలలకు స్లాట్లు అందుబాటులో ఉంటాయని, గ్రామ, వార్డు సచివాలయాల్లో బుక్ చేసుకోవాలని సూచించారు. ఆయా తేదీల్లో నిర్దేశించిన జిల్లా, బోధనాస్పత్రులకు వెళ్లి వైద్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే పెన్షన్లకు అర్హత సాధిస్తారు.
News November 12, 2025
నటుడు ధర్మేంద్ర డిశ్చార్జ్

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ఇటీవల ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేరారు. చికిత్స అనంతరం ఇవాళ ధర్మేంద్రను ఇంటికి పంపించారు.


