News May 17, 2024
కవిత కేసులో CBI అధికారులకు నోటీసులు
లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ అధికారులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈడీ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సీబీఐ అధికారులు ప్రశ్నించేందుకు ట్రయల్ కోర్టు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఆ లోపు కవిత పిటిషన్‌పై సీబీఐ అధికారులు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
Similar News
News January 11, 2025
భారత్-ఇంగ్లండ్ T20 సిరీస్ షెడ్యూల్
☛ జనవరి 22- తొలి T20- కోల్‌కతా
☛ జనవరి 25- రెండో T20- చెన్నై
☛ జనవరి 28- మూడో T20- రాజ్‌కోట్
☛ జనవరి 31- 4వ T20- పుణే
☛ ఫిబ్రవరి 2- ఐదో T20- ముంబై
☛ ☛ అన్ని <<15128809>>మ్యాచ్‌లు <<>>రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం అవుతాయి.
News January 11, 2025
యశస్వీ జైస్వాల్‌కు మరోసారి నిరాశే
టీమ్ ఇండియా క్రికెటర్ యశస్వీ జైస్వాల్‌కు మరోసారి బీసీసీఐ మొండిచేయి చూపింది. ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ఆయనను పరిగణనలోకి తీసుకోలేదు. బీజీటీలో రాణించిన జైస్వాల్‌ను టీ20 సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జైస్వాల్ అద్భుత ఫామ్‌ను బీసీసీఐ వృథా చేస్తోందని మండిపడుతున్నారు. గత ఐపీఎల్‌లో కూడా ఆయన రాణించారని, సెలక్ట్ చేయాల్సిందని కామెంట్లు చేస్తున్నారు.
News January 11, 2025
‘ఇండియన్-2’ లైఫ్ టైమ్ కలెక్షన్లు క్రాస్ చేసిన ‘గేమ్ ఛేంజర్’!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రెండో రోజూ భారీగానే కలెక్షన్లు వస్తున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ‘గేమ్ ఛేంజర్’ వసూళ్లు కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు-2’ లైఫ్ టైమ్ కలెక్షన్లు దాటేసినట్లు తెలిపాయి. శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం రూ.151 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. కాగా, ‘గేమ్ ఛేంజర్’ మొదటి రోజే రూ.186 కోట్లు కలెక్ట్ చేయడం గమనార్హం.