News January 25, 2025

ఫార్ములా-ఈ రేసు కేసులో FEO సంస్థకు నోటీసులు

image

TG: ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఎఫ్‌ఈవో కంపెనీకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థ సీఈవో స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనుంది. నోటీసులకు స్పందించిన సీఈవో విచారణకు హాజరయ్యేందుకు నాలుగు వారాల సమయం కోరారు. FEO సంస్థకు HMDA రూ.50కోట్లకు పైగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, BLN రెడ్డి, ఐఏఎస్ అరవింద్‌ను ఏసీబీ విచారించింది.

Similar News

News January 9, 2026

ధనుర్మాసం: ఇరవై ఐదో రోజు కీర్తన

image

కృష్ణుడి అనుగ్రహం కోసం గోపికలు నిద్రిస్తున్న గోపికను నిద్రలేపే సన్నివేశం ఇది. బయట ఉన్నవారు ఆమెను ‘చిలుక’ అని పిలుస్తూ త్వరగా రమ్మనగా ఆమె చమత్కారంగా బదులిస్తుంది. చివరకు కంసుని గజమైన కువలయాపీడాన్ని, శత్రువులను సంహరించిన ఆ కృష్ణుని గుణగానం చేస్తేనే వ్రతం ఫలిస్తుందని, అందరం కలిసి భగవంతుడిని కీర్తిద్దామని వారు ఆమెను సాదరంగా ఆహ్వానిస్తారు. ఇలా అందరూ కలిసి భక్తితో కృష్ణుని వైపు పయనిస్తారు. <<-se>>#DHANURMASAM<<>>

News January 9, 2026

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్లు, బెల్టులు

image

TG: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్లు, బెల్టులు ప్రభుత్వం అందజేయనుంది. విద్యాశాఖ ప్రతిపాదనలను CM రేవంత్ రెడ్డి ఆమోదించారు. తద్వారా దాదాపు 20 లక్షలకు పైగా విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. అదే సమయంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆడబిడ్డలకు ప్రాధాన్యం ఇవ్వాలని CM సూచించారు. దీంతో మొదటి విడత పాఠశాలలు బాలికలకు కేటాయించనున్నారు.

News January 9, 2026

ఇకపై షోరూంలోనే వెహికల్ రిజిస్ట్రేషన్

image

TG: రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ షోరూంలోనే పూర్తి చేసుకోవచ్చు. ఈ విధానం 15 రోజుల్లో అమలులోకి రానుంది. దీంతో ఇకపై కొత్త కారు, బైక్ కొన్నప్పుడు RTA ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. డీలర్ ఆన్‌లైన్‌లో అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. RC నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికే వచ్చేస్తోంది. ఈ సౌకర్యం నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది.