News November 16, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో BRS మాజీ MLAకు నోటీసులు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ MLA చిరుమర్తి లింగయ్యతో పాటు నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల నేతలకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు పలువురిని అరెస్ట్ చేయగా, ప్రధాన సూత్రధారుల కోసం వేట కొనసాగుతోంది.

Similar News

News November 16, 2024

దావాలో మైక్రోసాఫ్ట్‌ను చేర్చిన మస్క్

image

ఓపెన్ ఏఐపై టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ దావా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ దావాలోకి మైక్రోసాఫ్ట్‌ను, వెంచర్ క్యాపిటలిస్ట్ రీడ్ హాఫ్‌మ్యాన్‌ను చేర్చారు. ఒకప్పుడు ఆ సంస్థలో ఉన్న మస్క్‌ 2018లో బయటికొచ్చేశారు. తర్వాత మైక్రోసాఫ్ట్ అందులో 13 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. అయితే, తమ పోటీ ఏఐ యాప్‌లలో పెట్టుబడి పెట్టకుండా ఇన్వెస్టర్లను చాట్ జీపీటీ అడ్డుకుంటోందంటూ మస్క్ కోర్టుకెక్కారు.

News November 16, 2024

నాకు ఐఐటీ చదివే కొడుకున్నాడు: తమన్

image

సంగీత దర్శకుడు తమన్ తన పుట్టినరోజు సందర్భంగా పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. తన కుమారుడు ఐఐటీలో చదువుతున్నారని వెల్లడించారు. ‘మా అబ్బాయి ఐఐటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. నా సోషల్ మీడియా ఖాతాలను, సంగీత సంబంధిత వ్యవహరాలను నా భార్యే చూసుకుంటుంది. నాకు డబ్బు కావాలన్నా తననే అడుగుతాను. మా కుటుంబమంతా ఇప్పుడిప్పుడే హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతున్నాం’ అని తెలిపారు.

News November 16, 2024

జో బైడెన్‌లాగే మోదీకీ మతిపోయిందేమో: రాహుల్

image

అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌లానే ప్రధాని మోదీకి మెమరీ లాస్ అయిందని LoP రాహుల్ గాంధీ సెటైర్ వేశారు. ‘మోదీజీ స్పీచ్ విన్నట్టు నా చెల్లి నాతో చెప్పింది. ఈ మధ్యన మేమేం మాట్లాడినా ఆయనా అదే చెప్తున్నారని పేర్కొంది. బహుశా ఆయనకు మెమరీ లాస్ అయిందేమో. జోబైడెన్ సైతం జెలెన్ స్కీ వస్తే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినట్టు చెప్పారు. ఆయనలాగే మన ప్రధానికీ మతి పోయిందేమో’ అని మహారాష్ట్ర సభలో అన్నారు.