News October 1, 2024
జోగి రమేశ్‌కు నోటీసులు.. నందిగం బెయిల్‌పై వాదనలు పూర్తి

AP: చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌కు మంగళగిరి పోలీసులు నోటీసులిచ్చారు. రేపు ఉదయం డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటు టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టైన మాజీ ఎంపీ నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును 4వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
Similar News
News November 2, 2025
‘కాశీబుగ్గ’ తొక్కిసలాట అప్డేట్స్

* మృతుల కుటుంబాలకు కేంద్ర మంత్రి రామ్మోహన్, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు రూ.15 లక్షల చొప్పున పరిహారం అందజేశారు.
* కేంద్రం ప్రకటించిన రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా త్వరలో అందుతుందని రామ్మోహన్ చెప్పారు.
* పలాస ఆస్పత్రి నుంచి 15 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. మరో 11 మందికి సీహెచ్‌సీతో చికిత్స కొనసాగుతోంది. మెరుగైన వైద్యం కోసం ఒకరిని శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించాం: మంత్రి సత్యకుమార్ యాదవ్
News November 2, 2025
20 నెలల్లోనే రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు: శ్రీధర్ బాబు

TG: ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను అత్యున్నత స్థానంలో నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పని చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 20 నెలల వ్యవధిలోనే రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పారు. BRS పాలనలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూనే… మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేరుస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్‌లో మంత్రి ప్రచారం నిర్వహించారు.
News November 2, 2025
NHలపై ప్రమాదాలు.. కాంట్రాక్టర్లకు భారీ ఫైన్లు

నేషనల్ హైవేలపై ప్రమాదాలు, మరణాలను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక నిర్దిష్ట ప్రాంతంలోని 500M పరిధిలో ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగితే కాంట్రాక్టర్‌కు ₹25L, మరుసటి ఏడాదీ యాక్సిడెంట్ జరిగితే ₹50L ఫైన్ విధించనుంది. బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్(BOT) విధానంలో నిర్మించే రోడ్లకు దీన్ని వర్తింపజేస్తామని, ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లదేనని ఓ అధికారి వెల్లడించారు.


