News April 7, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో MLCకి నోటీసులు?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఓ ఎమ్మెల్సీకి త్వరలో నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాప్ చేసే పరికరాలకు సదరు ఎమ్మెల్సీ నిధులు సమకూర్చారని పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. ఆయనను విచారిస్తే మరికొందరి నేతల పేర్లు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారట. ఇప్పటివరకు పోలీసుల చుట్టే తిరిగిన ఈ కేసు ఇకపై రాజకీయ నేతల చుట్టూ తిరగనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News November 3, 2025

హైదరాబాద్‌లో వర్షం షురూ..

image

TG: హైదరాబాద్‌లో వర్షం మొదలైంది. కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, బాలానగర్, గచ్చిబౌలి, మల్కాజ్‌గిరి, కాప్రాలో వర్షం పడుతోంది. రాబోయే 2 గంటల్లో అమీర్‌పేట్, హిమాయత్‌నగర్, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, ఓయూ, చార్మినార్, నాంపల్లిలోనూ వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

News November 3, 2025

స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో విచారణ

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఎలక్షన్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించగా తమ అభిప్రాయం తెలిపేందుకు గడువు కోరింది. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈ నెల 24కి వాయిదా వేసింది.

News November 3, 2025

ఓట్లు చీల్చేందుకే పోటీ చేస్తున్నామనడం సరికాదు: ఒవైసీ

image

బిహార్ ఎన్నికల్లో ‘ఇండీ’ కూటమి ఓట్లు చీల్చేందుకే పోటీ చేస్తున్నామన్న విమర్శలను MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. ‘2020లో 5 సీట్లు గెలిచాం. పోటీచేసిన మిగతా 14లో 9 MGB గెలిచింది. 2024లో కిషన్‌గంజ్ MP సీటులో 2 లక్షలకుపైగా ఓట్లు సాధించాం. మేం ఆ ఒక్క సీట్లో పోటీచేసినా BJP అనేక చోట్ల గెలిచింది’ అని తెలిపారు. గుత్తాధిపత్యాన్ని బ్రేక్ చేయడానికే తమ పోటీ అన్నారు. ఈసారి MIM 24చోట్ల పోటీ చేస్తుంది.