News March 13, 2025
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు

TG: కోడి పందాల నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు రావాలని పేర్కొన్నారు. మొయినాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో కోడి పందాలు నిర్వహించారని ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే తనకు కోడి పందాలతో సంబంధం లేదని, వేరే వ్యక్తికి ఫామ్ హౌస్‌ను లీజుకు ఇచ్చినట్లు ఆయన గత నెలలో పోలీసులకు వివరణ ఇచ్చారు.
Similar News
News March 13, 2025
SSMB29పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన ఒడిశా డిప్యూటీ సీఎం

సూపర్ స్టార్ మహేశ్‌బాబు ‘SSMB29’ సినిమా షూటింగ్‌పై ఒడిశా డిప్యూటీ CM ప్రవతి పరిద అప్డేట్ ఇచ్చారు. ‘గతంలో ‘పుష్ప-2’, ఇప్పుడు రాజమౌళిలాంటి స్టార్ డైరెక్టర్ తీస్తోన్న SSMB29 షూటింగ్‌నూ ఒడిశాలో జరుపుతుండటం సంతోషం. ప్రస్తుతం కోరాపుట్‌లో మహేశ్, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రాలతో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇవి ఒడిశా టూరిజానికి ఊపునిస్తాయి. షూటింగ్‌లకు ప్రధాన గమ్యస్థానంగా మారుతుంది’ అని పేర్కొన్నారు.
News March 13, 2025
హోలీని నిషేధించిన మమతా సర్కారు.. BJP ఫైర్

బెంగాల్ బీర్‌భూమ్ జిల్లా శాంతినికేతన్లో హోలీ వేడుకలను మమతా బెనర్జీ సర్కారు నిషేధించడం వివాదాస్పదంగా మారింది. ఇది యునెస్కో వారసత్వ సంపదని, రంగులు చల్లుకుంటే వృక్ష సంపదకు నష్టమని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఫారిన్ టూరిస్టులు వస్తారు కాబట్టి పండగ జరుపుకోవద్దని బ్యానర్లు కట్టించారు. FRI రంజాన్ ప్రార్థనలు ఉంటాయి కాబ్టటి 10AM లోపే రంగులు చల్లుకోవాలని సూచిస్తున్నారు. దీనిపై BJP ఆందోళన చేస్తోంది.
News March 13, 2025
రిషభ్ పంత్ చెల్లెలి పెళ్లి.. PHOTO

భారత క్రికెటర్ రిషభ్ పంత్ చెల్లెలి వివాహ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముస్సోరిలోని లగ్జరీ హోటల్లో సాక్షి, లండన్ వ్యాపారవేత్త అంకిత్ చౌదరి పెళ్లాడారు. ఈ పెళ్లి వేడుకకు ధోనీ, రైనా, పృథ్వీ షా, నితీశ్ రాణా, పలువురు నటులు హాజరయ్యారు.