News October 5, 2024

‘RG కర్’ మృతురాలి ఫొటో వెల్లడించిన వారికి నోటీసులు

image

కోల్‌కతాలోని RG కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచారం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో మృతురాలి వివరాలను, ఫొటోను సోషల్ మీడియాలో పలువురు వెల్లడించారు. అలాంటి 25మందిని కోల్‌కతా పోలీసులు గుర్తించి నోటీసులు పంపించినట్లు సమాచారం. వీటిలో కొన్ని బంగ్లాదేశ్ నుంచి కూడా నడుస్తున్నాయని తెలుస్తోంది. ఐపీ అడ్రెస్‌ ఆధారంగా వాటిని ట్రేస్ చేస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి.

Similar News

News December 2, 2025

ASF: గుర్తులు రెఢీ.. రేపే ఉపసంహరణకు చివరి రోజు

image

ఆసిఫాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలి విడతలో నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. ఉపసంహరణ తర్వాతే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. సర్పంచ్ స్థానానికి 30, వార్డు సభ్యులకు 20కి పైగా గుర్తులు కేటాయించారు. సర్పంచ్ కు గులాబీ బ్యాలెట్, వార్డు సభ్యులకు తెలుపు బ్యాలెట్ ను నిర్ణయించారు. ఆల్ఫాబెటికల్‌గా గుర్తులను కేటాయిస్తారు. ఏ గుర్తు ఎవరికి వస్తుందని చర్చించుకుంటున్నారు.

News December 2, 2025

పుతిన్ పర్యటన.. ఈ విషయాలు తెలుసా?

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ 2 రోజుల పర్యటన కోసం ఇండియాకు రానున్నారు. ఆయన ఇక్కడ ఉన్నంతసేపు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. తినేందుకు ఆహార పదార్థాలు, నీరు, ఇతర వస్తువులు రష్యా నుంచే తీసుకొస్తారు. క్రెమ్లిన్ చెఫ్ వండిన ఆహారాన్ని చెక్ చేసేందుకు ఓ మొబైల్ ల్యాబ్ ఏర్పాటుచేస్తారు. టాయ్‌లెట్‌నూ అక్కడి నుంచే తెచ్చి, మలమూత్రాలను తీసుకెళ్తారు. ఆయన ఫోన్ వాడరు. ప్రత్యేకమైన బూత్‌ నుంచే టెలిఫోన్‌లో మాట్లాడుతారు.

News December 2, 2025

కాంతార వివాదం: క్షమాపణలు చెప్పిన రణ్‌వీర్ సింగ్

image

కాంతార ఛాప్టర్-1 విషయంలో తలెత్తిన <<18445119>>వివాదంపై<<>> బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ‘ఆ చిత్రంలో రిషబ్ అద్భుతమైన నటనను హైలైట్ చేయడం మాత్రమే నా ఉద్దేశం. అలాంటి సీన్ చేయడం ఎంత కష్టమో ఓ నటుడిగా నాకు తెలుసు. ప్రతి సంస్కృతి, సంప్రదాయాన్ని నేను గౌరవిస్తా. ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమాపణలు కోరుతున్నా’ అని పేర్కొన్నారు.