News September 12, 2024

1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్

image

TG: 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 21 నుంచి అక్టోబర్ 8లోపు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుంచి 46 ఏళ్లలోపు వారు అర్హులు. నవంబర్ 10న CBT విధానంలో పరీక్ష ఉంటుంది. ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ పరిధిలో 1088, వైద్య విధానపరిషత్‌లో 183, MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో 13 పోస్టులున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

Similar News

News November 19, 2025

HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>HLL<<>> లైఫ్‌కేర్ లిమిటెడ్‌ ఆఫీసర్ ఆపరేషన్స్ పోస్టుల భర్తీ చేస్తోంది. డీ ఫార్మసీ,/బీ ఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 24న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.lifecarehll.com/

News November 19, 2025

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

కొంత కాలంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,24,860కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 1,100 ఎగబాకి రూ.1,14,450 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 పెరిగి రూ.1,73,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 19, 2025

పండ్ల తోటల్లో పిందె/కాయలు ఎందుకు రాలిపోతాయి?

image

పండ్ల తోటల్లో పుష్పాలు సరిగా సంపర్కం చెందకపోతే పిందె సరిగా కట్టదు. ఒకవేళ కట్టినా కాయలు ఎదగక మధ్యలోనే రాలిపోతాయి. తోటల్లో సజ్రతని, బోరాన్, కాల్షియం, పొటాష్ పోషకాలు, హోర్మోన్ల లోపం వల్ల కూడా పిందెలు, కాయ ఎదిగే దశల్లో రాలిపోతాయి. రసం పీల్చే పురుగులు, పండు ఈగ, ఆకుమచ్చ, బూడిద తెగుళ్లు, అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు, రాత్రివేళ అల్ప ఉష్ణోగ్రతలు, ఆకస్మిక వర్షాల వల్ల పండ్ల తోటల్లో పిందెలు, కాయలు రాలుతాయి.