News September 1, 2025
13,217 ఉద్యోగాలకు నోటిఫికేషన్

IBPS RRB XIV-2025 నోటిఫికేషన్ వెలువడింది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ల పోస్టులున్నాయి. ఇవాళ్టి నుంచి SEP 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలను బట్టి డిగ్రీ, LLB, డిప్లొమా, CA, MBA/PGDM పూర్తిచేసిన వారు అర్హులు. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాష్ట్రాలు, బ్యాంకుల వారీగా ఖాళీలు, ఇతర వివరాల కోసం <
Similar News
News September 4, 2025
నెలాఖరు వరకు పొగాకు కొనుగోళ్లు: అచ్చెన్న

AP: సెప్టెంబర్ నెలాఖరులోగా నల్ల బర్లీ పొగాకు కొనుగోళ్లు పూర్తి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ‘రాష్ట్రంలో 80 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి జరిగింది. మార్క్‌ఫెడ్, ప్రైవేటు కంపెనీలు 55 మిలియన్ల కిలోలు కొన్నాయి. మిగిలిన పొగాకులో నెలాఖరులోగా 5 మి. కిలోలు మార్క్‌ఫెడ్, 20 మి. కిలోలు ప్రైవేటు కంపెనీలు కొనుగోలు చేయాలి. వచ్చే రబీలో ఎవరూ నల్ల బర్లీ పొగాకు పండించొద్దు’ అని సూచించారు.
News September 4, 2025
అప్పటివరకు పాత శ్లాబ్‌లోనే సిగరెట్, గుట్కా, బీడీ

కొత్తగా తీసుకొచ్చిన GST సంస్కరణలు ఈనెల 22 నుంచి అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. అయితే SIN(హానికర) ట్యాక్స్ పరిధిలో ఉన్న సిగరెట్, గుట్కా, పాన్ మసాలా, టొబాకో, జర్దా, బీడీలపై విధించిన 40% ట్యాక్స్ అమల్లోకి రావడానికి మరింత సమయం పట్టనుంది. తదుపరి తేదీ ప్రకటించే వరకు ఇవి 28% శ్లాబ్‌లోనే కొనసాగనున్నాయి. ప్రస్తుతం సిగరెట్లపై సైజ్‌లను బట్టి GST, సెస్ కలిపి గరిష్ఠంగా 64% ట్యాక్స్ అమల్లో ఉంది.
News September 4, 2025
అన్ని కార్ల ధరలు తగ్గుతాయ్..

కొత్త జీఎస్టీ విధానంలో లగ్జరీ <<17606719>>కార్లను<<>> 40% శ్లాబులోకి (గతంలో 28%) తెచ్చారు. అయితే ఇంజిన్ కెపాసిటీతో సంబంధం లేకుండా అన్ని కార్ల ధరలు తగ్గుతాయని మీకు తెలుసా? ఎలా అంటే..
*ప్రస్తుతం 1200 cc (పెట్రోల్ ఇంజిన్) కంటే ఎక్కువ ఉన్న కార్లపై 28% జీఎస్టీతో పాటు 22% సెస్ వేస్తున్నారు. దీంతో పన్ను 50% పడుతోంది. కొత్త విధానంలో 40% జీఎస్టీలోకి తెచ్చారు. కానీ సెస్ పూర్తిగా తొలగించారు. దీంతో 10% పన్ను మిగిలినట్లే..