News December 21, 2024
13,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. మరో శుభవార్త

SBI 13,735 జూనియర్ అసోసియేట్స్ ఉద్యోగ నోటిఫికేషన్లో 609 బ్యాక్లాగ్ పోస్టులను కలిపి భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తుండగా, JAN 7 వరకు అప్లై చేయవచ్చు. APలో 50, TGలో 342 ఖాళీలున్నాయి. డిగ్రీ పూర్తైన 20-28 ఏళ్లలోపు వారు అర్హులు. SC, ST, దివ్యాంగులు, ఎక్స్సర్వీస్మెన్లకు ఫీజు లేదు. మిగతా వారు రూ.750 చెల్లించాలి. FEBలో ప్రిలిమ్స్, మార్చి/ఏప్రిల్లో మెయిన్స్ నిర్వహిస్తారు.
Similar News
News January 22, 2026
భారత్లో T20 WC ఆడేదే లేదు: బంగ్లాదేశ్

ICC T20WC మ్యాచ్లు భారత్లో ఆడేదే లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. వెన్యూ మార్చితే తమ నిర్ణయంలో మార్పు ఉంటుందని పేర్కొంది. తమకు WC ఆడాలని ఉందని, అయితే ఇండియాలో కాదని తెలిపింది. భద్రత దృష్ట్యా తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని కోరగా ఐసీసీ ఒప్పుకోని విషయం తెలిసిందే. భారత్లో ఆడాల్సిందేనని ICC తేల్చిచెప్పింది. దీంతో ఇవాళ BCB తమ తుది నిర్ణయాన్ని వెల్లడించింది.
News January 22, 2026
నవజాత గొర్రె పిల్లల మరణాలకు కారణం ఏమిటి?

నవజాత గొర్రె పిల్లల మరణాలు పెంపకందారులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. పుట్టిననాటి నుంచి 28 రోజుల వయసు కలిగిన గొర్రె పిల్లలను నవజాత పిల్లలుగా పరిగణిస్తారు. నవజాత పిల్లల మరణాల్లో దాదాపు 35 శాతం అవి పుట్టినరోజే సంభవిస్తాయని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. గొర్రెల పెంపకందారుల నిర్లక్ష్యం, వ్యాధికారక క్రిములు, సూక్ష్మజీవులు, పరాన్న జీవులు సోకడమే ఈ మరణాలకు కారణమని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
News January 22, 2026
ఎండోమెంట్ వ్యవసాయేతర భూముల లీజును తప్పుబట్టిన హైకోర్టు

AP: దేవాలయ వ్యవసాయేతర భూములను సుదీర్ఘకాలం లీజుకు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఛారిటీ సంస్థలకు భూముల్ని లీజుకు ఇచ్చేలా ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.15ను నిలిపివేసింది. దేవదాయ భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు వాదించగా, ఇప్పటికే లీజులు పొందిన వారిని ఖాళీ చేయించడం కష్టతరంగా మారిందని AG వాదించారు. అనంతరం కోర్టు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.


