News May 19, 2024

BSFలో 144 పోస్టులకు నోటిఫికేషన్

image

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF)లోని వివిధ విభాగాల్లో 144 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(ఫిజియోథెరపిస్ట్, ల్యాబ్), SI స్టాఫ్ నర్స్, SI వెహికల్ మెకానిక్, కానిస్టేబుల్(టెక్నికల్) తదితర ఉద్యోగాలున్నాయి. ఇవాళ్టి నుంచి జూన్ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత ఉండాలి. పూర్తి వివరాల కోసం <>https://rectt.bsf.gov.in/<<>> వెబ్‌సైట్‌లో చూడగలరు.

Similar News

News November 20, 2025

YVUలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ

image

YVU P.G. కళాశాల ఫైన్ ఆర్ట్స్ శాఖలో కూచిపూడి నృత్యంలో మహిళా బోధకురాలు నియామకం కోసం ఈ నెల 25వ తేదీన 2 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ. టి.శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు డిప్లొమా ఇన్ కూచిపూడి డ్యాన్స్/ పీజీ ఇన్ కూచిపూడి డ్యాన్స్ అర్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. వివరాలకు www.yvu.edu.in ని సంప్రదించాలన్నారు.

News November 20, 2025

మూవీ రూల్స్‌కు రీడైరెక్ట్ కావడంపై విచారణలో రవికి ప్రశ్నలు

image

ఐ-బొమ్మ కేసులో రవి పోలీస్ కస్టడీ తొలిరోజు ముగిసింది. వెబ్‌సైట్‌కు సంబంధించి కీలక విషయాలపై పోలీసులు ఆరా తీశారు. ఇవాళ వెలుగులోకి వచ్చిన ‘ఐబొమ్మ వన్’పైనా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దాని నుంచి మూవీ రూల్స్‌కు రీడైరెక్ట్ కావడంపై రవిని అడిగారు. అతడు వాడిన మొబైల్స్ వివరాలు, నెదర్లాండ్స్‌లో ఉన్న హోమ్ సర్వర్ల డేటా, హార్డ్ డిస్క్‌ల పాస్‌వర్డ్, NRE, క్రిప్టో కరెన్సీ, పలు వ్యాలెట్లపై సుదీర్ఘంగా విచారించారు.

News November 20, 2025

అపార్ట్‌మెంట్‌లో అందరికీ ఒకే వాస్తు ఉంటుందా?

image

అపార్ట్‌మెంట్ ప్రాంగణం ఒకటే అయినా వేర్వేరు బ్లాక్‌లు, టవర్లలో దిశలు మారుతాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలుపుతున్నారు. ‘సింహద్వారం దిశ, గదుల అమరిక వేర్వేరుగా ఉంటాయి. అందువల్ల ప్రతి ఫ్లాట్‌కి వాస్తు ఫలితాలు కూడా మారుతాయి. అందరికీ ఒకే వాస్తు వర్తించదు. ప్రతి ఫ్లాట్‌ని దాని దిశ, అమరిక ఆధారంగానే చూడాలి. మీ జన్మరాశి, పేరు ఆధారంగా వాస్తు అనుకూలంగా ఉందో లేదో చూడాలిలి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>