News December 2, 2024

ఈ నెలలో 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్: మంత్రి

image

TG: ప్రతి నెలా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ నెలలో 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ 39వ వ్యవస్థాపన దినోత్సవాల్లో ఆయన మాట్లాడారు. పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించాలని తమ ప్రభుత్వం ఆరాటపడుతోందన్నారు. ఇతర కార్పొరేషన్ రంగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News November 28, 2025

జపాన్ కామెంట్స్ ఎఫెక్ట్.. ఫ్రాన్స్ మద్దతుకు ప్రయత్నిస్తున్న చైనా

image

జపాన్‌తో వివాదం ముదురుతున్న వేళ ఫ్రాన్స్ మద్దతు కోసం చైనా ప్రయత్నిస్తోంది. ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మద్దతుగా నిలబడాలని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ దౌత్య సలహాదారుతో చైనా దౌత్యవేత్త వాంగ్ ఇ చెప్పారు. ‘వన్-చైనా’ విధానానికి ఫ్రాన్స్ సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నట్టు చెప్పారు. ఆర్థిక, వాణిజ్య అంశాలపై చర్చించడానికి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వచ్చే వారం చైనా వస్తున్నారు.

News November 28, 2025

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.710 పెరిగి రూ.1,28,460కు చేరింది. అలాగే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 650 ఎగబాకి రూ.1,17,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 పెరిగి రూ.1,83,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 28, 2025

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు

image

హైదరాబాద్‌-నాచారంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌(<>BEL<<>>) గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. బీఈ, బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిసెంబర్ 9న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇప్పటికే అప్రెంటిస్‌గా శిక్షణ పొందినవారు అనర్హులు. వెబ్‌సైట్: https://bel-india.in/