News September 21, 2024
త్వరలోనే 3వేల పోస్టులకు నోటిఫికేషన్

తెలంగాణలోని 8 మెడికల్ కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే 3 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. వీటితో పాటు ఏటూరు నాగారం ఫైర్ స్టేషన్కు 34 సిబ్బంది మంజూరు, కోస్గిలో ఇంజినీరింగ్ కాలేజీ, హకీంపేటలో జూనియర్ కాలేజీ మంజూరుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రెండేళ్లలో SLBC టన్నెల్ పనులు పూర్తి చేసేలా రూ.4637 కోట్లు మంజూరు చేసింది.
Similar News
News October 19, 2025
ALERT: టపాసులు కాలుస్తున్నారా?

దీపావళి వచ్చిందంటే చిన్నా పెద్దా తేడా లేకుండా బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకోవడం సాధారణమే. అయితే పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆస్తమా, చర్మ సమస్యలు, అలర్జీస్ ఉన్న పిల్లలను ఇళ్ల నుంచి బయటకు వెళ్లనీయొద్దని సూచిస్తున్నారు. పొగ, దుమ్ము లంగ్స్పై ప్రభావం చూపుతాయని, సీరియస్ అలర్జిక్ రియాక్షన్స్కు దారి తీస్తాయంటున్నారు.
News October 19, 2025
డ్యూడ్ మూవీకి కళ్లుచెదిరే కలెక్షన్స్

ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు కాంబోలో వచ్చిన డ్యూడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే కలెక్షన్స్ రాబడుతోంది. ఈనెల 17న విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. తొలిరోజు రూ.22 కోట్లు కొల్లగొట్టిన ‘డ్యూడ్’ రెండో రోజు అంతకుమించి రూ.23 కోట్లు రాబట్టింది. చిన్న హీరో మూవీకి ఈ రేంజ్లో కలెక్షన్స్ రావడం విశేషం.
News October 19, 2025
దూడలలో తెల్లపారుడు వ్యాధి ఎలా వ్యాపిస్తుంది?

తెల్లపారుడు వ్యాధిని కలిగించే ఇ.కోలి క్రిమి సహజంగా దూడ పేగులలో ఉంటుంది. దూడలు అపరిశుభ్రమైన పొదుగు లేదా పాత్రలలో పాలు తాగినప్పుడు, ఒక్కసారిగా ఎక్కువగా పాలు తాగినప్పుడు, వెన్న ఎక్కువగా ఉన్న చివరి పాలు తాగినప్పుడు, పాలు తాగే సమయాలలో తేడా ఉన్నప్పుడు, జున్నుపాలు సరిగా తాగనప్పుడు, దూడల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు.. దూడ పేగుల్లోని హానికర ఇ.కోలి సంఖ్య పెరిగి తెల్లపారుడు వ్యాధి కలుగుతుంది.