News June 28, 2024

TGలో 435 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

TG: రాష్ట్రంలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. DPH&FW/DME విభాగంలో 431(మల్టీ జోన్-1లో 270, మల్టీ జోన్-2లో 161) ఉద్యోగాలున్నాయి. అభ్యర్థులు MBBS పూర్తి చేసి ఉండాలి. IPM డిపార్ట్‌మెంటులో 4 పోస్టులున్నాయి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు అర్హులు. జులై 2 నుంచి 11 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్‌: <>https://mhsrb.telangana.gov.in/<<>>

Similar News

News November 19, 2025

ఇంటర్మీడియట్ పరీక్షల్లో మార్పులు

image

AP: వచ్చే ఏడాది ఇంటర్ 1st ఇయర్‌ పరీక్షల్లో బుక్‌లెట్ పేజీలను 24నుంచి 32కు పెంచారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కామర్స్‌కు 32 పేజీలు ఉంటాయి. బయాలజీలో వృక్షశాస్త్రం, జంతుశాస్త్రానికి 24పేజీల చొప్పున 2 బుక్‌లెట్లు ఇస్తారు. భౌతిక, రసాయన, జీవశాస్త్ర పరీక్షలు 85 మార్కులకు పాస్ మార్క్స్ 29. కొన్ని సబ్జెక్టుల్లో 30% వచ్చినా, మొత్తం 35% ఉంటే పాస్‌గా పరిగణిస్తారు.

News November 19, 2025

ఇతిహాసాలు క్విజ్ – 71

image

ఈరోజు ప్రశ్న: గణేశుడు మహాభారతాన్ని రాసేటప్పుడు తన దంతాన్ని ఎందుకు విరిచాడు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 19, 2025

ఉమెన్ డెవలప్‌మెంట్ & చైల్డ్ వెల్ఫేర్‌లో ఉద్యోగాలు

image

తిరుపతిలోని <>ఉమెన్<<>> డెవలప్‌మెంట్ & చైల్డ్ వెల్ఫేర్‌ 8 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఏడో తరగతి , డిప్లొమా (హౌస్ కీపింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, హాండీక్రాఫ్ట్), డిగ్రీ అర్హతగల వారు ఈ నెల 24వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.250, SC, ST, BCలకు రూ.200. వెబ్‌సైట్: tirupati.ap.gov.in/