News October 3, 2025

646 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(C-DAC)లో 646 ఉద్యోగాలకు(కాంట్రాక్ట్) నోటిఫికేషన్ వెలువడింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నోయిడా, పుణే తదితర బ్రాంచ్‌లలో మేనేజర్, ప్రాజెక్ట్ అసోసియేట్, ఇతర పోస్టులున్నాయి. జాబ్‌ను బట్టి B.Tech/B.E, M.E/M.Tech, MCA, M.Phil/Ph.D చేసిన వారు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ OCT 20. వెబ్‌సైట్: <>https://cdac.in/<<>>

Similar News

News October 3, 2025

ఇతిహాసాల్లో ‘8’ సంఖ్య ప్రాముఖ్యత

image

ఇతిహాసాలు, పురాణాల్లో ‘8’ సంఖ్యకు విశేష స్థానం ఉంది. ఇది సృష్టిలోని సమగ్రతకు, పరిపూర్ణతకు ప్రతీక. మనకు అష్ట దిక్కులు ఉన్నాయి. ప్రకృతిని పాలించే అష్ట వసువులు ఉన్నారు. న్యాయాన్ని సూచించే త్రాసు దారాలు, శక్తికి నిదర్శనమైన శరభ మృగానికి కాళ్లు ఎనిమిదే. విఘ్నేశ్వరుని నామాలు కూడా ఎనిమిదే. ‘8’ సంఖ్య అష్టైశ్వర్యాలు, అష్టసిద్ధులతో ముడిపడి భక్తులకు శ్రేయస్సును, విజయ మార్గాన్ని సూచిస్తుంది. <<-se>>#Sankhya<<>>

News October 3, 2025

ALERT.. కాసేపట్లో వర్షం

image

TG: హైదరాబాద్, నగర పరిసర ప్రాంతాల్లో రాబోయే 2-3 గంటల్లో వర్షం పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం పడొచ్చని అంచనా వేసింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా ఇప్పటికే ఆసిఫాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మీ జిల్లాల్లో వాన పడుతోందా? కామెంట్ చేయండి.

News October 3, 2025

ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. 24న సెకండియర్ స్టూడెంట్స్‌కు లాంగ్వేజ్ పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. JAN 23న ఎన్విరాన్‌మెంటల్ ఎగ్జామ్, FEB 1 నుంచి 10 వరకు ప్రాక్టికల్స్, 13న సమగ్ర శిక్షా పరీక్షలు జరగన్నాయి. టేబుల్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.