News October 10, 2024
ఆయూష్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

AP: బీఏఎంఎస్, BHMS, BUMS కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ యూజీ-2024లో అర్హత పొందిన విద్యార్థులు ఈ నెల 14వ తేదీలోపు వర్సిటీ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలంది. ఇటు MBBS మేనేజ్మెంట్ కోటాలో చేరిన విద్యార్థులు ఈ నెల 14తేదీ లోపు ఫ్రీఎగ్జిట్ అవ్వొచ్చని తెలిపింది. దివ్యాంగ కోటాలో కన్వీనర్ సీట్లు పొందిన వారు ఈ నెల 11లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలంది.
Similar News
News October 28, 2025
ఉసిరితో మహిళలకు ఎన్నో లాభాలు

ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసిందే. ముఖ్యంగా మహిళలకు ఇది చాలా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. హార్మోన్లను సమతుల్యం చేయడంలో, PCOD, డయాబెటీస్‌ను తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. అలాగే జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతుంది. దీన్ని పచ్చిగా, ఎండబెట్టి పొడిలా, పచ్చడి, జ్యూస్ ఇలా నచ్చిన విధంగా తీసుకోవచ్చంటున్నారు.
News October 28, 2025
భారీగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ గంటల వ్యవధిలోనే <<18126051>>రెండోసారి<<>> గోల్డ్ రేట్స్ తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24క్యారెట్ల 10గ్రా.ల బంగారంపై రూ.2460 తగ్గి రూ.1,20,820కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.2,250 పతనమై రూ.1,10,750గా ఉంది. అటు కేజీ వెండిపై ఇవాళ రూ.5వేలు తగ్గడంతో రూ.1,65,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News October 28, 2025
మొదలైన వర్షం

తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం మొదలైంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, మాదాపూర్, యూసఫ్‌గూడ, శేరిలింగంపల్లి, పంజాగుట్ట, బంజారాహిల్స్ కూకట్‌పల్లిలోనూ వాన కురుస్తోంది. మరికాసేపట్లో సిద్దిపేట, యాదాద్రితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.


